ఈ నెల 29 ,30 న ఎపిపిఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు – కనకనరసా రెడ్డి
తిరుపతి,ఆగష్టు 28 : ఈ నెల 29, 30 న ఆంద్ర
Revised
పత్రికా ప్రకటన
ఈ నెల 29 ,30 న ఎపిపిఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు – కనకనరసా రెడ్డి
తిరుపతి,ఆగష్టు 28 : ఈ నెల 29, 30 న ఆంద్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష తిరుపతి కేంద్రం గా జూపార్క్ వద్ద గల ఇయాన్ డిజిటల్ కేంద్రంగా 352 మంది అభ్యర్థులు మూడు సెషన్స్ లో వ్రాయనున్నారని ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టాలని తిరుపతి రెవెన్యూ డివిజనల్ అధికారి కనకనరసారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుదవారం ఉదయం ఏపీపీఎస్సీ, రెవెన్యూ అధికారులతో స్టానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ సమావేశమై పరీక్షనిర్వహణకు పలు సూచనలను చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఇయాన్ డిజిటల్ జూపార్క్ పరీక్షా కేంద్రంలో రెండురోజులు మూడు సెషన్స్ లలో వ్రాయాల్సి వుంటుందని తెలిపారు. ఈ నెల 29న ఉదయం 9.30 నుండి 12.00 వరకు, మరుసటి రోజు తేది.30న ఉదయం 9.30 నుండి 12.00 వరకు, మద్యాహ్నం 3.00 నుండి 5.30 గంటలవరకు పరీక్షల నిర్వహణ వుంటుందని అన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి పరీక్షా సమయానికి 30 నిముషాల ముందే చేరుకోవాలని, ఆపై అనుమతి వుండదని, అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల్లో బయో మెట్రిక్ హాజరు వుంటుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల అనుమతి వుండదని, హాల్ టికెట్ తో పాటు ఏదేని ఒక దృవపత్రం వెంట తీసుకెళ్లాలని, క్రిమిలేయర్ సర్టిఫికేట్ సరిచూసుకోవాలని తప్పుగా వుంటే పరీక్ష కేంద్రంలో మరొకటి ఇవ్వవచ్చని సూచించారు. పరీక్షా కేంద్రం వద్ద ఉదయం 7.30 గంటలనుండే 144 సెక్షన్ అమలు లో వుంటుందని దగ్గరలోని ఇంటర్ నెట్ , జిరాక్స్ సెంటర్లు పరీక్షా సమయాల్లో మూసివేయాల్సి వుంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్లు ప్రశాంత్ కుమార్, వసంత్ కుమార్ పరీక్షల నిర్వహణలో విధులు కేటాయించిన రెవెన్యూ అధికారులు, డిటి లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.