విజ‌య‌వాడ గేట్‌వే హోట‌ల్‌లో త‌మిళ‌నాడు రుచులు సిద్ధం

it
* చెట్టినాడ్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం 
, విజ‌య‌వాడ‌: భోజ‌న‌ప్రియుల కోరిక మేర‌కు నోరూరించే త‌మిళ‌నాడు సంప్ర‌దాయ వంట‌కాల‌ను ప‌రిచ‌యం చేస్తూ డిన్న‌ర్ బ‌ఫే మీల్స్‌ను సోమ‌వారం నుంచి అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు విజ‌య‌వాడ మ‌హాత్మాగాంధీరోడ్డులోని హోట‌ల్ గేట్‌వే ఫుడ్ అండ్ బేవరేజ్ మేనేజర్ ఎస్.వి. రమణమూర్తి,    
సేల్స్ అసిస్టెంట్ కూరాకుల గోపి చెప్పారు. ఈ సంద‌ర్భంగా శుక్రవారం హోట‌ల్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో త‌మిళ‌నాడు వంట రుచుల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా గోపి మాట్లాడుతూ చెట్టినాడ్ ఫుడ్ ఫెస్టివ‌ల్ పేరిట ఏర్పాటు చేసిన డిన్న‌ర్ బ‌ఫే మీల్స్‌ను శుక్రవారం నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వ‌ర‌కు ప్ర‌తిరోజూ రాత్రి 7:30 నుండి 11 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తామ‌న్నారు. ప‌జా దోశ‌, మ‌సాల మిల‌గాయ్ బ‌జ్జీ, ప‌చ్చాయ్ ప‌ట్నీ వ‌డ‌, నెరికా ర‌సం, ముల‌గ ర‌సం, న‌వ‌త‌నియా సారు వంట రుచుల‌తో పాటు చికెన్ చెట్టినాడ్‌, చికెన్ నీల్‌గిరి కుర్మా, చికెన్ ప‌ల్లిపాయ‌లమ్‌, క‌దంబ మసాల వంటి నాన్‌వెజ్ ర‌కాలు, క్యాలీఫ్ల‌వ‌ర్ చెట్టినాడ్‌, సొర‌కాయ్ కుట్టు, ప‌కోడా కార త‌దిత‌ర వెజ్ కూర‌లు, ఐస్‌క్రీమ్‌లు, మిఠాయిలు వంటి చెన్నై సంప్ర‌దాయ రుచులు డిన్న‌ర్‌లో వండివారుస్తామ‌న్నారు. ఆయా ఆహార‌ప‌దార్థాల‌న్నీ హోట‌ల్‌లోని ఎగ్జిక్యూటివ్ చీఫ్ చెఫ్ శ్రీధర్, చెఫ్ జయ్ కుమార్, బ్రహ్మజీ ఆధ్వ‌ర్యంలో రూపొందిస్తామ‌న్నారు. న‌గ‌ర‌వాసులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.