క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో

క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో


దాండియా, గార్భా మెగా ఈవెంట్


నిపుణత ప్రదర్శించిన శిక్షణార్ధులకు లక్షలాది రూపాయల బహుమతులు


 విజయవాడ: నగరంలో నిర్వహిస్తున్న గార్భా, దాండియా నృత్యరీతుల కార్యశాలకు మంచి స్పందన లభిస్తుందని  క్రియేటివ్ సోల్ వ్యవస్ధాపకులు సుమన్ మీనా, నేహాజైన్ తెలిపారు. ప్రధాన టైటిల్  స్పాన్సర్ గా జిఎం మాడ్యులర్ వ్యవహరిస్తుండగా, రిజిస్ట్రేషన్ల ప్ర్ర్రక్రియ తదుపరి శిక్షణ వేగంగా సాగుతుందన్నారు. ప్రస్తుత కార్యశాల లో ఉదయం 10గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిరాటంకంగా సాగే శిక్షణలో ఏదేని గంట నిడివిని ఔత్సాహిక కళాకారులు ఎంపిక చేసుకుని శిక్షణ పొందుతున్నారన్నారు. గార్బా, దాండియా 2019 ప్రధాన కార్యక్రమం సెప్టెంబరు 28వ తేదీన లబ్బీపేట ఎస్ఎస్ కన్వేన్వన్ సెంటర్లో  జరగనుండగా, ప్రధాన ప్రయోజకులుగా జిఎం మాడ్యులర్  వ్యవహరిస్తుందని వివరించారు. ప్రస్తుత కార్యక్రమాన్ని సెప్టెంబరు 28 నాటి మెగా ఈవెంట్ కు ప్రమెషన్ గా నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుత ప్రమోషన్ కార్యక్రమంలో పురుషుల విభాగంలో సౌరవ్, మహిళల విభాగంలో మయూరి, ఉత్తమ వేషధారణ విభాగంలో రితిక అగ్రభాగాన నిలిచి బహుమతులు అందుకున్నారు. 


 మెగా ఈవెంట్ లో దాండియా, గర్బా నృత్యాలతో పాటు గుజరాతీ సంగీత కళాకారుల పాటలు, వాద్య కళాకారులు వీనుల విందైన సంగీతం అందిస్తారని సుమన్ పేర్కొన్నారు. గుజరాతీ దుస్తులు, వస్త్రాలు, ఆభరణాలు, కళాకృతులు, చిత్రలేఖనాల ప్రదర్శన ఉంటుందని మరిన్ని వివరాలకు 9849468498, 8317556636, 9121605288 నెంబర్లతో సంప్రదించవచ్చని నేహా జైన్ పేర్కొన్నారు. మెగా ఈవెంట్ ప్రవేశం కోసం ఎంట్రీ టిక్కెట్లను జ్యోతి కన్వెన్షన్ సెంటర్ నుండి ప్రతి రోజూ సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల వరకు పొందవచ్చని , 26 సాయంత్రం వరకు ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపారు. సాధారణంగా ఉత్తర భారత దేశానికే పరిమితం అయిన గార్బా, దాండియా నృత్యరీతులను  ఆంధ్రప్రదేశ్ కు  పరిచయం చేసే క్రమంలో తాము ఈ వర్క్ షాపును నిర్వహిస్తున్నామన్నారు.


కళలతో దేశసమైఖ్యతను చాటేలా  గుజరాతీ, రాజస్ధానీ పడతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గత రెండు సంవత్సరాలుగా నగర వాసులు మంచి సహకారం అందిస్తున్నారన్నారు.  విజయవాడ యువతీ యువకుల కోసం ప్రత్యేకంగా 21 రోజుల పాటు దాండియా శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.  ప్రదర్శనకారులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తూ, ఉత్సాహభరిత ప్రదర్శనలను ప్రోత్సహించే క్రమంలో నిపుణత ప్రదర్శించిన కళాకారులకు రూ.లక్షకు పైబడిన బహుమతులను అందిస్తున్నామన్నారు. దుర్గాదేవికి మహిషాసురునికి మధ్య జరిగే యుద్దానికి ప్రతీకగా ఉత్తర భారత దేశంలో దాండియా అడతారని, అమ్మవారికి హారతి ఇచ్చే ముందు చిన్నా, పెద్ద కలిసి ఈ నృత్యం చేస్తారని సుమన్ మీనా వివరించారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image