పక్షోత్సవాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టరు ఎఎండి ఇంతియాజ్

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఆయుష్మాన్ భారత్ - అందరీ ఆరోగ్యం - సెప్టెంబరు 15 నుండి 2 అక్టోబరు వరకు నిర్వహించి  పక్షోత్సవాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టరు ఎఎండి ఇంతియాజ్ పిలుపునిచ్చారు.  ఆదివారం విజయవాడ నగరంలోని జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయం వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవాల  ప్రారంభపు కార్యక్రమాన్ని కలెక్టరు ఎ.ఎండి .ఇంతియాజ్ జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభి oచారు.