రైతు భరోసా’కు సర్వే: కన్నబాబు

'రైతు భరోసా'కు సర్వే: కన్నబాబు
తూర్పుగోదావరి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్‌ రైతు భరోసా పథకం లబ్దిదారుల కోసం బుధవారం నుంచి సర్వే ప్రారంభమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ నెల 25 వరకు సర్వే కొనసాగుతుందని స్పష్టం చేశారు. అదే విధంగా సర్వే కోసం మానిటరింగ్‌ కమిటీలను కూడా నియమించినట్లు పేర్కొన్నారు. బుధవారమిక్కడ ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతీ రైతుతో పాటు కౌలు రైతు కూడా లబ్దిదారుల జాబితాలో ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సర్వే వేగవంతంగా పూర్తి చేయడానికి వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, వాలంటీర్లతో కలిసి పని చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.  రైతు భరోసా కింద ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే సొమ్మును వేరొక రుణాలకు జమ చేయకూడదని బ్యాంకర్లను సీఎం జగన్‌ ఆదేశించారని కన్నబాబు తెలిపారు.