గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌

గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
గుంటూరు : దశాబ్దకాలంగా ప్రతిపాదనలకే పరిమితమైన గుంటూరు కమిషనరేట్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో గుంటూరు, విజయవాడ కలిపి మెగా కమిషనరేట్‌ చేయాలని ప్రతిపాదించారు. సాంకేతిక కారణాల వలన ఆ ప్రతిపాదన అటకెక్కింది. రాజధాని ఏర్పాటైనప్పటికీ పోలీస్‌శాఖ పరంగా ఇంతవరకు ఎటువంటి మార్పులు లేకపోవడంతో రాజధానిలో భద్రత వ్యవహారం పోలీసులకు సమస్యగా మారింది. వీటన్నింటిని అధిగమించి గుంటూరు, రాజధాని ప్రాంతంతో కలిపి ఒక కమిషనరేట్‌ ఏర్పాటు చేసేందుకు అర్బన్‌ ఎస్పీ రామకృష్ణ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు డీజీపీతో పాటు పోలీస్‌ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ప్రతిపాదనలోని అంశాలివి..
తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌ కూడా అర్బన్‌ జిల్లాలో కలిపి పోలీస్‌ కమిషనరేట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిషనర్‌గా ఐజీ స్థాయి అధికారి ఉంటారు. జాయింట్‌ కమిషనర్లుగా డీఐజీ స్థాయి అధికారులను నియమించనున్నారు. అలాగే ఎస్పీ స్థాయి అధికారులు డీసీపీలుగా ఉంటారు. కమిషనరేట్‌లో ఒక కమిషనర్‌తో పాటు ఇరువురు జాయింట్‌ కమిషనర్‌లు, ఇరువురు ఎల్‌ అండ్‌వో డీసీపీలు ఉంటారు. తుళ్లూరు, తాడికొండ, తాడేపల్లి, మంగళగిరి కలిపి ఒక డీసీపీ ఉంటారు. గుంటూరు నగరంతో పాటు మిగిలిన ప్రాంతాలకు మరో డీసీపీ ఉంటారు.
అలాగే కమిషనరేట్‌లో ఎల్‌అండ్‌వోకు ఒక జాయింట్‌ కమిషనర్‌, మిగిలిన వాటికి మరో జాయింట్‌ కమిషనర్‌ ఉంటారు. అర్బన్‌ పరిధిలో కొత్తగా ఆరు ఎల్‌ అండ్‌వో పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసి సబ్‌ డివిజన్‌లు కూడా అందుకు అనుగుణంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌ను రెండుగా విభజించాలని భావిస్తున్నారు. సెక్రటేరియెట్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలతో సెక్రటేరియెట్‌ పోలీస్‌స్టేషన్‌ను కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తాడేపల్లి మున్సిపాలిటీని తాడేపల్లి టౌన్‌ స్టేషన్‌గా, మిగిలిన గ్రామాలతో తాడేపల్లి రూరల్‌ స్టేషన్‌గా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మంగళగిరి టౌన్‌లో ఇక్కడ అదనంగా మరో స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని భావించారు. నవులూరు కేంద్రంగా మరో స్టేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పెదకాకాని పోలీస్‌ స్టేషన్‌ను రెండుగా, నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ను కూడా రెండుగా విభజించాలని నిర్ణయించారు. గోరంట్ల కేంద్రంగా మరో పోలీస్‌ స్టేషన్‌ను, హైవేకు ఇరువైపుల ఉన్న గ్రామాలతో నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పట్టాబిపురం, అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్ల పరిధి అధికంగా ఉండటంతో ఈ రెండు పోలీస్‌ స్టేషన్ల నుంచి మరో పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అమరావతి రోడ్డులో కొంత భాగంను కలిపి గుజ్జనగుండ్ల కేంద్రంగా మరో స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాడికొండ, తుళ్లూరు స్టేషన్లతో ఒక సబ్‌ డివిజన్‌, తాడేపల్లి టౌన్‌, రూరల్‌, నవులూరు కలిపి ఒక సబ్‌ డివిజన్‌, మంగళగిరి టౌన్‌, రూరల్‌, యూనివర్సిటీతో మరో సబ్‌ డివిజన్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పెదకాకాని, గోరంట్ల, గుజ్జనగుండ్ల స్టేషన్లతో మరో సబ్‌ డివిజన్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇవి కాక ప్రస్తుతం ఉన్న ఈస్ట్‌, వెస్ట్‌, సౌత్‌ సబ్‌ డివిజన్‌లు యదావిధిగా కొనసాగున్నాయి. దీంతో ఎల్‌ అండ్‌వోకు మొత్తం ఏడుగురు డీఎస్పీలు రానున్నారు. వీరిలో తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి సబ్‌ డివిజన్‌లను కలిపి ఒక డీసీపీ కిందకు తీసుకురానున్నారు. మిగిలిన ఈస్ట్‌, వెస్ట్‌, సౌత్‌, గోరంట్ల సబ్‌ డివిజన్‌లను మరో డీసీపీ కిందకు తీసుకురానున్నారు. దీంతో రాజధాని ప్రాంతంలో ఒక ఎస్పీ, గుంటూరు పరిధిలో మరో ఎస్పీ రానున్నారు. నూతన కమిషనరేట్‌లో కొత్తగా మరో మూడు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు, ఒక సైబర్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం తుళ్లూరులో ఒక ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఉంది. కొత్తగా తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు టౌన్‌లో మూడు స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి ట్రాఫిక్‌ స్టేషన్‌లకు ఒక డీఎస్పీ, టౌన్‌ స్టేషన్లకు ఒక డీఎస్పీ ఉంటారు. వీరిద్దరిపైన ట్రాఫిక్‌కు ప్రత్యేకంగా ఒక డీసీపీ ఉంటారు. రాజధానిలో ప్రత్యేకంగా సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌, అడ్వాన్స్‌డ్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం గుంటూరు కేంద్రంగా ఉన్న ఏఆర్‌ విభాగాన్ని కూడా రెండుగా విభజించాలని ప్రతిపాదించారు. తాడేపల్లిలో సగం ఎఆర్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తారు. మొబైల్‌ రిజర్వు ఫోర్స్‌గా పిలుస్తారు. గుంటూరులో కోర్టు, జైలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్‌ వంటి వాటికి మిగిలిన ఫోర్స్‌ విధులు నిర్వహిస్తారు. దీనిని సిటీ సెక్యూరిటీ విభాగం పిలుస్తారు. అర్బన్‌లో తాడేపల్లి, పాతగుంటూరు, వంటి అనేక స్టేషన్లలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా పోలీస్‌ స్టేషన్లను కూడా అప్‌గ్రేడేషన్‌ చేయాలని ప్రతిపాదించారు. దీని కారణంగా సిబ్బంది సంఖ్య పెరగనుంది.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image