టిడిపి నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తేయాలి : చంద్రబాబుతో భేటీలో టిడిపినేతల డిమాండ్

ఇంత పెద్దఎత్తున రాష్ట్రవ్యాప్త నిరసనలు వెల్లువెత్తినా వైసీపీ ప్రభుత్వానికి స్పందన లేదు. నిన్న నెల్లూరులో ఒకరిని చంపారు. జగ్గయ్యపేటలో ముస్లిం యువకుడిపై దాడి చేసారు. రాయదుర్గంలో టిడిపి కార్యకర్తలను దారుణంగా కొట్టారు.జమ్మలమడుగులో పేద రైతుల పత్తి పంట ధ్వంసం చేసారు. ఇవన్నీ మీడియా చూపిస్తోందని వాటిపై దాడికి తెగపడ్డారు. చట్టాన్ని అందరూ గౌరవించాలి. అధికారం ఉందని మూర్ఖంగా పాలించకూడదు. పత్రికా స్వేచ్ఛను గౌరవించాలి. బాధితులకు వెంటనే న్యాయం చేయాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. టిడిపి నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తేయాలి : చంద్రబాబుతో భేటీలో టిడిపి నేతల డిమాండ్