గోతులు పూడ్చాoడి  మహాప్రభో: పోతిన వెంకట మహేష్

                   గోతులు పూడ్చాoడి  మహాప్రభో


విజయవాడ:


జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ ఈరోజు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పశ్చిమ నియోజకవర్గంలో ముంపు నివారణకు చర్యలు చేపట్టాలని గోతులు పడ్డ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కేవలం 30 నిమిషాల  వర్షానికి పాతబస్తీ ముంపూకు గురవుతుందని, ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని ప్రకటించిన మంత్రి గారు ముందు గోతులు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేయిస్తే ఆడే భాగ్యమని పశ్చిమ నియోజకవర్గ ప్రజలు బావిస్తునారాని , తమరికి కమిషనర్ గారికి ఎన్నిసార్లు మోర  పెట్టుకుంటున్న కనీస స్పందన లేకపోవడం చాలా దారుణం అని ప్రజలు తమ  బాధను వ్యక్తం చేస్తున్నారు ,  రాబోయే దసరా ఉత్సవాల సందర్భంగా వన్ టౌన్ మీద నుంచి ట్రాఫిక్ మళ్ళించే టువంటి సాంప్రదాయం ఉన్నందున తమరు తప్పక వెంటనే స్పందించి గోతులు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు  ఆదర్శ నియోజకవర్గం సంగతి దేవుడెరుగు ముందు ముంపు నివారణకు చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరఫున కోరుతున్నాం. 75 లక్షల రూపాయల కాంట్రాక్టు తో సిమెంట్ రోడ్లు వేయడానికి కాంట్రాక్టర్లు దొరుకుతారు గాని  శంకుస్థాపనలు శిలాఫలకాలు వేస్తారు కానీ నిత్యం జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో గోతులు పూడ్చడానికి  కాంట్రాక్టర్లు దొరకడం లేదంటే మీ సామర్థ్యం పనితనం ఏంటో ప్రజలకు బాగా అర్థం అవుతున్నాయి అని మహేష్ అన్నారు.