ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ నుంచి గుంటూరుకు కోడెల పార్థీవదేహం

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ నుంచి గుంటూరుకు కోడెల పార్థీవదేహం
హైదరాబాద్ : ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ నుంచి కోడెల పార్థీవదేహాన్ని గుంటూరుకు తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నానికి గుంటూరుకు చేరుకోనుంది. ఎన్టీఆర్‌ భవన్‌ నుంచి విజయవాడ మీదుగా గుంటూరుకు తరలించారు. నకిరేకల్‌, చిట్యాల, కోదాడ, జగ్గయ్యపేట, నందిగామ మీదుగా విజయవాడకు తరలించారు. ప్రకాశం బ్యారేజీ మీదుగా మంగళగిరికి కోడెల పార్థీవదేహాన్ని తరలించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు పార్టీ ఆఫీసుకి కోడెల పార్థివదేహాన్ని తరలించనున్నారు. గుంటూరు టీడీపీ ఆఫీసులో 2 గంటల పాటు ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు గుంటూరు నుంచి నరసరావుపేటకు తరలించనున్నారు. రేపు ఉదయం కోడెల అంత్యక్రియలు నిర్వహించనున్నారు.