సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే:బల్దియా మేయర్ గుండా ప్రకాశరావు

సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే:బల్దియా మేయర్ గుండా ప్రకాశరావు
◆ఇగ్నైట్ ఫెస్ట్-2019 కార్యక్రమంలో పాల్గొన్న మేయర్..
GWMC,12 సెప్టెంబర్ 2019:
   సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే అని బల్దియా మేయర్ గుండా ప్రకాశరావు అన్నారు.తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల(బాయ్స్),యాకుబ్ పుర,వరంగల్ వారి అద్వర్యం  లో (రీజనల్ స్థాయిలో) నిర్వహిస్తున్న IGNITE FEST-2019 కార్యక్రమానికి మేయర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ,కష్టించే తత్వాన్ని అలవరచుకోవాలని తద్వారా ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవచ్చునన్నారు.కడు పేదరికం నుండి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి పదవి సాధించిచేలా  ఎదిగిన కాకి మాధవరావు ఉదంతాన్ని మేయర్ గుర్తుచేశారు.స్వామి వివేకానందుడు చెప్పినట్లు సర్వ శక్తులు మన లొనే ఇమిడి ఉంటాయని వాటిని బయటకు తీసి సద్వినియోగం చేసుకోవాలని మేయర్ అన్నారు.అబ్దుల్ కలాం స్ఫూర్తిగా కలలు కనాలని వాటిని సాధించాలన్నారు.
  ఈ కార్యక్రమంలో రీజినల్ కో-ఆర్డినెటర్ డి.యస్.వెంకన్న,కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస రెడ్డి,వైస్-ప్రిన్సిపాల్ మధు,డిప్యూటీ సెక్రెటరీశ్రీనివాస రెడ్డి, టి. డబుల్యూ. ఆర్.యస్.ఫ్రీడమ్ స్కూల్ ప్రిన్సిపాల్ విమల,ఇగ్నైట్ ఫెస్ట్ కో-ఆర్డినటర్ శ్రీనివాస రాయ్,సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సంగీత్ సాగర్,సి.ఓ.ఈ. వైస్-ప్రిన్సిపాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.