లక్షలకోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తి, కోడెలను దొంగంటాడా?

తేది 17-09-2019


విలేకరుల సమావేశం వివరాలు


లక్షలకోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తి, కోడెలను దొంగంటాడా?


  జగన్‌ ఆదేశాలు, మంత్రుల వేధింపులు, అధికార యంత్రాంగం సాధింపులే కోడెల ఊపిరితీశాయి


నర్సరావుపేటలో 144 సెక్షన్‌ ఎత్తేయకుంటే ప్రభుత్వం తగినమూల్యం చెల్లించుకుంటుంది.


                                            - శ్రీ వర్ల రామయ్య


        ప్రజానాయకుడు చనిపోయి, ఆయన కుటుంబం, తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర ప్రజలు శోకసంద్రంలో మునిగినవేళ, ఆయన అంతిమయాత్ర హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు వస్తున్న వేళ, జగన్మోహన్‌రెడ్డి, ఆయన మంత్రివర్గం శవరాజకీయాలు చేస్తూ వికృతానందాన్ని పొందుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కోడెల అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు బాధాతప్తహృదయాల తో తమనేతను తలుచుకొని బాధపడుతుంటే, జగన్‌ కేబినెట్‌లోని మంత్రులు వేరే పనేమీలేదన్న ట్లుగా ఒకరి తరువాతఒకరు, ఒకటోకృష్ణుడు, రెండోకృష్ణుడి మాదిరి ఎందుకు పత్రికాసమావేశాలు పెడుతున్నారని రామయ్య ప్రశ్నించారు. ప్రభుత్వ వేధింపులు, కక్షసాధింపులు, జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలతో అధికార యంత్రాంగం కోడెలపై బనాయించిన తప్పుడు కేసులవల్లే ఆయన చనిపోయాడన్నది వాస్తవం కాదా అని వర్ల వైసీపీ ప్రభుత్వాన్ని నిగ్గదీశారు. జగన్‌ ప్రభుత్వం కోడెల అంతిమయాత్ర జరుగుతున్న సమయంలో కావాలనే దగుల్భాజీ రాజకీయాలు చేస్తోందన్నారు. శివప్రసాదరావుగారిపై ఒక పెట్టీకేసు పెట్టి, కేవలం రూ.2లక్షల విలువ చేసే ఫర్నీచర్‌ను ఆయన దొంగిలించాడని దుర్మార్గపు ప్రచారం చేసి, పులిలా బతికిన వ్యక్తి చివరకు బలవన్మరణానికి పాల్పడేలా చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి కాదా అని రామయ్య నిలదీశారు. రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడి, ప్రజలసొమ్ము కొట్టేసిన వ్యక్తి కాలుమీద కాలు వేసుక్కూర్చొని సిగ్గులేకుండా రాష్ట్రాన్ని పాలిస్తుంటే, తనపై వచ్చిన అబద్ధపు ఆరోపణలకు  అభిమానధనుడైన కోడెల అవమానభారంతో కుంగిపోయాడని వర్ల రామయ్య పేర్కొన్నారు.  సమాజంలో, రాజకీయాల్లో పులిలా బతికిన వ్యక్తిని ఒక దొంగగా, దోపిడీదారుగా చిత్రీకరించింది జగన్‌ ప్రభుత్వం కాదా అన్నారు. విధిలేని పరిస్థితుల్లో చేసేదిలేక కోడెల ఆత్మహత్య చేసుకుంటే దానిపై మీ ప్రభుత్వం, మీ మంత్రులు, ఏ2 విజయసాయి రెడ్డి సిగ్గులేకుండా విషప్రచారం చేయడం ఏమిటని రామయ్య ప్రశ్నించారు. ఉచితమే కదా అని ఇష్టమొచ్చినట్లుగా చనిపోయిన వ్యక్తిని గురించి ట్వీట్లు పెడుతున్న దొంగరెడ్డి (విజయసాయి) తనపై ఉన్న కేసుల గురించి, జగన్‌పై ఉన్న కేసుల గురించి ఎందుకు ట్వీట్లు పెట్టడని రామయ్య ఎద్దేవాచేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని రూ.లక్షల కోట్ల అవినీతి చేసి, రూ.43వేల కోట్ల అవినీతి జరిగిందని సీబీఐ నిర్ధారించిన తరువాత, 16 నెలలు చంచల్‌గూడ జైల్లో చిప్పకూడు తిన్న వ్యక్తిపై ఏం చర్యలు తీసుకోవాలో విజయసాయి సమాధానం చెప్పగలడా అని రామయ్య తీవ్రస్వరంతో   వ్యాఖ్యానించారు. వైసీపీ మంత్రులు, విజయసాయి ట్వీట్లు, జగన్‌ ఆదేశాలు, అధికార యంత్రాం గం వేధింపుల వల్లే ముమ్మాటికీ కోడెల చనిపోయాడన్నారు. కోడెల మరణించాక ఆయనపై 11 ట్వీట్లు పెట్టిన విజయసాయిరెడ్డి ఎన్ని కేసుల్లో ముద్దాయో, ప్రజలందరికీ తెలుసునన్నారు. కోడెల విషయంలో తప్పుచేసిన వారంతా దేవుడికోర్టులో శిక్షనుంచి తప్పించుకోలేరన్న వర్ల, ఏంతప్పు చేశాడని కుటుంబంతో సహా, కోడెలపై ఈ ప్రభుత్వం వేధింపులకు పాల్పడిందన్నారు. తనదగ్గరున్న ఫర్నీచర్‌ తీసుకెళ్లాలని కోడెల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖరాసినా, దాన్ని వదిలేసిన ప్రభుత్వం ఆయన్ని ఎందుకు వెంటాడిందన్నారు. తండ్రి అధికారంలోకి రాకముందు రూ.2లక్షల ఆదాయపుపన్ను కట్టిన జగన్‌, వైఎస్‌ ముఖ్యమంత్రి అయ్యాక రూ.80కోట్ల ముందస్తు పన్ను చెల్లింపులు ఎలా చేశారో ప్రజలకు సమాధానం చెప్పగలరా అని రామయ్య నిలదీశారు. అద్దె ఇంట్లో ఉంటున్న కోడెలపై, ఐదుచోట్ల విలాసవంతమైన భవనాలు కట్టుకున్న జగన్‌ కేసులు పెట్టడం ఎంతవరకు భావ్యమన్నారు. కోడెల ఆస్తులు, జగన్‌ ఆస్తులు ప్రకటిస్తే ఎవరు దొంగో, ఎవరు దొరో ప్రజలే నిర్ణయిస్తారని రామయ్య స్పష్టం చేశారు. కోడెల అంత్యక్రియలను శాంతియుతంగా నిర్వహించాలని తెలుగుదేశం అనుకుంటుంటే, వైసీపీ ప్రభుత్వం 144సెక్షన్ల పేరుతో రెచ్చగొట్టాలని చూస్తోందన్నారు.  


--


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image