19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక

19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
నెల్లూరు జిల్లా వెంకట గిరి పట్నం లో జరిగే గ్రామ శక్తి పోలేరమ్మ జాతర లో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొంటారు.ఈ మేరకు మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.19 వ తేదీ గురువారం ఉదయం విజయవాడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం తొమ్మిది గం లకు నెల్లూరు చేరుకొని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను వారి స్వగృహం లో మర్యాద పూర్వకంగా కలిసి, నెల్లూరు మీదుగా వెంకటగిరి చేరుకొని ఉదయం 11 గం లకు వెంకట గిరి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. వెంకట గిరి పట్నం లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే గ్రామ శక్తి పోలేరమ్మ జాతర లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం నెల్లూరు నుంచి విజయవాడ కు రోడ్డు మార్గమున ప్రయనమవుతారు.