అమరావతి
పడవ ప్రమాద మృతుల కుటుంబాలను నేడు తెదేపా నేతల బృందం పరామర్శించనుంది.
పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో తెదేపా నేతలు నేడు రాజమహేంద్రవరం చేరుకోనున్నారు.
దుర్ఘటన పూర్వాపరాలను నేతలు అడిగి తెలుసుకోనున్నారు. బాధిత కుటుంబాలను కలిసి వారికి ధైర్యం చెప్పనున్నారు.
టీడీఎల్పీ ఉపనేతలు డొక్కా మాణిక్య వరప్రసాద్, బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రులు నిమ్మకాయల చిన రాజప్ప, దేవినేని ఉమా మహేశ్వరరావు, పితాని సత్యనారాయణ, జ్యోతుల నెహ్రు, ఎమ్మెల్లే ఆదిరెడ్డి భవాని తదితరులు పరామర్శించనున్నారు