చంద్రబాబు స్ర్కిప్టునే ఇంకా పవన్ కళ్యాణ్ చదువుతున్నాడు

చంద్రబాబు స్ర్కిప్టునే ఇంకా పవన్ కళ్యాణ్ చదువుతున్నాడు
* వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య 
అమ‌రావ‌తి: చంద్రబాబు స్ర్కిప్టునే ఇంకా పవన్ కళ్యాణ్ చదువుతున్నాడు. పవన్ కళ్యాణ్ సొంతంగా ఎప్పుడు మాట్లాడడం నేర్చుకుంటాడో అర్ధం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా పాలన చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు అని వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోశ‌య్య అన్నారు. శ‌నివారం ఉద‌యం ఆయ‌న తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. 19 చారిత్రాత్మకమైన బిల్లులను సీఎం జగన్మోహన్ రెడ్డి  తీసుకువచ్చారు. అక్షరాస్యత పెంచాలని సీఎం జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. ఇవేమీ పవన్ కళ్యాణ్ కు కనిపించడం లేదు. 19 చారిత్రత్మక బిల్లులుపై పవన్ కళ్యాణ్ అధ్యయనంలో చేయాలి. జనసేన పార్టీ టీడీపీ అనుబంధ పార్టీగా కొనసాగుతోంది. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబు అవినీతి ని ప్రశ్నించలేదు. 600లకు పైగా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదు. ఉద్దానం పవన్ కళ్యాణ్ వెళ్తే అన్ని అన్ని మౌళిక వసతులు కల్పిస్తామని చంద్రబాబు మాట తప్పితే జగన్మోహన్ రెడ్డి ఉద్దానంలో 200 పడకల ఆస్పత్రి కట్టిస్తున్నారు. వరదలు వలన ఇసుక పాలసీలో కొంత ఇబ్బంది ఏర్పడింది. ఇసుకలో వేల కోట్లు టీడీపీ నేతలు దోచుకుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. రూ.1.50 వేల కోట్లను చంద్రబాబు అప్పు చేసి దోచుకుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు.  ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా  సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర లక్షల ఉద్యోగాలు సృష్టించారు. చంద్రబాబు కు పవన్ కళ్యాణ్ రహస్య మిత్రుడుగా పని చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నే పవన్ కళ్యాణ్ చదువుతున్నాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ తన పార్టీని విస్తరించుకోలేకపోతున్నారు. జ‌గన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక వర్షాలు పడి నదులు నిండి రైతులు సంతోషంగా ఉన్నారు. రైతులను నిర్లక్ష్యం చేసింది చంద్రబాబే. పవన్ కళ్యాణ్ ధైర్యం ఉంటే నిజాయితీగా నిజాలు మాట్లాడాలి. అమరావతిలో భూసేకరణ కు ఒప్పుకోనన్న పవన్ కళ్యాణ్ తరువాత మాట మార్చారు. రాజధాని మార్చుతామని సీఎం జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ చెప్పారా. ఉగాది రోజున 25 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇస్తామన్న సీఎం మాటలు పవన్ కళ్యాణ్ కు కనిపించడం లేదా. ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో చంద్రబాబు నవ్వుల పాలయ్యారు. జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నం జరిగితే డీజీపీ స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం పవన్ కళ్యాణ్‌కు కనిపించలేదా. సినిమాలో వలే చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ను పవన్ కళ్యాణ్ చదువుతున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి చంద్రబాబు కారణం అనే విషయం పవన్ కు తెలియదా.  లింగమనేని ఇచ్చిన ఇళ్లలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉంటూ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చెస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు లింగమనేని కామన్ ఫ్రెండ్. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పై పవన్ కళ్యాణ్ చర్చకు రావాలి. గోడ మీద పిల్లి వాటాన్ని పవన్ కళ్యాణ్ మానుకోవాలి. కాపు రిజర్వేషన్లు విషయంలో కాపులను మోసం చేసింది చంద్రబాబు కాదా. కాపులను మోసం చేసిన చంద్రబాబు ను పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు. పవన్ కళ్యాణ్ ను అడ్డంపెట్టుకుని కాపులను మోసం చేయాలని చంద్రబాబు చూసారు. వివేకానంద రెడ్డి హత్య కేసుపై విచారణ జరుగుతుంది.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image