*నేడు, రేపు కాకినాడ పర్యటనకు వెళ్లనున్న మన చంద్రబాబు*
రెండురోజులపాటు కాకినాడలో నియోజకవర్గాలవారీ సమీక్షలు
ఈనెల 5, 6 తేదీల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి మన చంద్రబాబునాయుడు జిల్లాలో పర్యటిస్తారు. ఆయన పర్యటనా షెడ్యూలును జిల్లా పార్టీ కార్యాలయం విడుదల చేసింది. మొదటిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం కాకినాడ అచ్చంపేట జంక్షన్ సమీపంలోని లక్ష్మీ పరిణయ ఫంక్షన్‌హాలులో నిర్వహిస్తారు. ఒంటి గంట నుంచి 2గంటల వరకు భోజన విరామం, మధ్యాహ్నం 2 గంటల నుంచి నియోజకవర్గాలవారీగా సమీక్షలను ప్రారంభిస్తారు. సమీక్షలకు కాకినాడ పార్టీ జిల్లా కార్యాలయం వేదిక కానుంది. అరగంటపాటు సమీక్షలను నిర్వహిస్తారు. సాయంత్రం 6గంటల వరకు సమీక్షలు ఉంటాయి. తొలుత అరకు పార్లమెంటు పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గ సమీక్ష ఉంటుంది. అనంతరం వరుసగా రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలోని అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజకవర్గాల సమీక్షలుంటాయి.అనంతరం అమలాపురం పార్లమెంటు పరిధిలోని రాజోలు, గన్నవరం, అమలాపురం, కొత్తపేట నియోజకవర్గాల సమీక్షలుంటాయి.
రెండోరోజు 6న ఉదయం ఇదే వేదికగా 9.30 గంటల నుంచి సమీక్షలుంటాయి. అమలాపురం పార్లమెంటు పరిధిలోని ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల సమీక్షలను చంద్రబాబు నిర్వహిస్తారు. కాకినాడ పార్లమెంటు పరిధిలోని తుని, జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాలకు నిర్వహిస్తారు. అనంతరం అమలాపురం పార్లమెంటు పరిధిలోని మండపేట, కాకినాడ పార్లమెంటు పరిధిలోని పెద్దాపురం నియోజకవర్గాల సమీక్షలు సాయంత్రం 3.30 గంటల వరకు జరుగుతాయి
నేడు, రేపు కాకినాడ పర్యటనకు వెళ్లనున్న మన చంద్రబాబు*