ఆకస్మిక తనిఖీలు

*టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, తిరుమల*


తిరుమలకి వెళ్లే  మెట్ల మార్గంలో ఉన్నటువంటి షాపులను, మరుగుదొడ్లను టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఆకస్మి.క     తనిఖీలు చేశారు. ఇందులో బాగంగా అక్కడ ఉంటువంటి పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతూ మరుగుదొడ్ల విషయంలో పరిశుభ్రంగా ఉండాలని,ప్రతిరోజు  ఉదయం,సాయంత్రం మరుగుదొడ్లు లోపల బయట బ్లీచింగ్ వేయాలని అధికారులకు ఆదేశించారు.  తిరుమలకు వెళ్లే భక్తులతో మాట్లాడుతూ తిరుమలకు వెళ్లే మార్గమధ్యంలోని సౌకర్యాల గురుంచి అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా అసౌకర్యం అనిపిస్తే వెంటనే తన కార్యాలయంలో పిర్యాదు చేయవచ్చున్నారు.  అక్కడ ఉన్నటువంటి వర్తకులతో మాట్లాడుతూ ఆహార పదార్ధాలన్ని పరిశుభ్రంగా మరియు MRP ధరలకే అమ్మాలని ఆదేశించారు..భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు.....