రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి కి తీవ్ర గాయాలు

నెల్లూరు జిల్లా:సైదాపురం మండలం చాగణం గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. రాపూరు మండలం కొట్టురుపాడు గ్రామానికి చెందిన ప్రసాద్ అనే దివ్యాoగుడు తన హోండా యాక్టివా త్రిచక్ర వాహనంపై  రాపూరు నుండి సైదాపురం వైపు వెళ్తుండగా అకస్మాత్తుగా అతనికి లోబీపీ వచ్చి కళ్ళు తిరగడంతో బైక్ ను అదుపుచేయలేకపోయాడు. ఈ క్రమంలో బైక్ బోల్తాపడడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అతనికి కుడి కన్ను పై భాగంలో తీవ్ర గాయమైంది. స్థానికులు స్పందించి 108 వాహనానికి సమాచారం అందించగా సకాలంలో చేరుకోకపోవడంతో  వెంటనే చికిత్స కొరకు ఓ కారులో గూడూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.