ఈనెల 30న తిరుమలకు సీఎం వైయస్‌.జగన్‌

27–09–2019
అమరావతి


*ఈనెల 30న తిరుమలకు సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*


అమరావతి: ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ఈనెల 30న తిరుమల వెళ్లనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 30న మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా తిరుచానూరు వెళ్తారు. తిరుచానూరులో పద్మావతి నిలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. అక్కడనుంచి అలిపిరి వెళ్తారు. అలిపిరి నుంచి చెర్లోపల్లి వరకూ నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. దీనితర్వాత తిరుమల వెళ్తారు. తిరుమలలో మాతృశ్రీ వకుళాదేవి రెస్ట్‌ హౌస్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. భర్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న మరో కాంప్లెక్స్‌నిర్మాణానికీ సీఎం శంకుస్థాపన చేస్తారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత పెద్దశేషవాహన సేవలో పాల్గొంటారు. రాత్రికి తిరుమలలోనే బసచేసి అక్టోబరు 1, ఉదయం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.