విక్రమ్‌ ఆచూకీ తెలిసింది

విక్రమ్‌ ఆచూకీ తెలిసింది


చంద్రయాన్‌-2లో పురోగతి 


విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీని గుర్తించినట్లు నేడు ఇస్రో ప్రకటించింది. 


ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ స్వయంగా వెల్లడించారు. 


ఆర్బిటర్‌ చంద్రుడి ఉపరితలంపై ఉన్న ల్యాండర్‌  థర్మల్‌ చిత్రాలను తీసిందని తెలిపారు. 


ల్యాండర్‌తో సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. 


త్వరలో ల్యాండర్‌తో సంబంధాలు ఏర్పడే అవకాశముందని శివన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.


చంద్రయాన్‌-2 సాఫ్ట్‌ ల్యాండింగ్‌లో భాగంగా శుక్రవారం ఆఖరు నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. 


ల్యాండర్‌ విక్రమ్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి సంకేతాలు తెగిపోయాయి. 


దీంతో యావత్‌ భారత్‌ ప్రజలు నిరాశ చెందిన సమయంలో ల్యాండర్‌ ఆచూకీ లభించడం ఊరట కలిగించే విషయమే.