ఇదీ వాటర్‌ గ్రిడ్‌

ఇదీ వాటర్‌ గ్రిడ్‌
రూ.4,200 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు రూపకల్పన
జిల్లావ్యాప్తంగా శుద్ధి చేసిన గోదావరి జలాల సరఫరా
2051 నాటికి పెరిగే జనాభాకు అనుగుణంగా ప్రాజెక్టు
రెండేళ్లలో పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక
భీమవరం : శుద్ధి చేసిన జలాలను జిల్లాలో అన్ని ప్రాంతాలకు గోదావరి చెంత నుంచి పైపులైన్‌ ద్వారా సరఫరా చేసేందుకు తయారు చేసిన వాటర్‌ గ్రిడ్‌ పథకం తుది రూపం దాల్చింది. ఉభయ గోదా వరి జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం
రాజమహేంద్రవరంలో నిర్వహించిన సమావేశంలో స్వల్ప మార్పులతో ఈ పథకం ఆమోదం పొందింది. గోదావరి నుంచి కాలువల ద్వారా వస్తున్న జలాలన్నీ కాలుష్యం కాసారంగా మారడంతో అందుకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టు రూపొందించిన సంగతి తెల్సిందే. ఈ పథకాన్ని 2051 నాటికి పెరిగే జనాభాను అంచనా వేసి రూపొందించారు. ఇప్పటి నుంచి అప్పటి వరకు అవసరమైన నీటిని లెక్కలు కట్టి తేల్చారు. ఈ ప్రకారం సరఫరా చేసే నీటిని గోదావరి చెంతనున్న విజ్జేశ్వరం-నిడదవోలు నీటి సరఫరా పాయింట్‌-1గాను, కొవ్వూరులో నది ప్రాంతం రెండవదిగా, ఎగువన ప్రక్కిలంక గ్రామం నది పాయింట్‌-3గాను, పోలవరం వద్ద రిజర్వాయర్‌ 4వ పాయింట్‌గా జిల్లా అంతటా మంచినీరు పైపులైన్‌ ద్వారా నీరు అందించేలా ఈ ప్రాజెక్టు రూపొందించారు. 15 అసెంబ్లీలలో ఉన్న మొత్తం 48 మండలాలకు చెందిన 908 గ్రామాలలోని 2,413 హేబిటేషన్‌లకు ఈ నీటిని సరఫరా చేసేలా డిజైన్‌ చేశారు. జిల్లాలో ఈ ప్రాజెక్టు కోసం తయారు చేసిన అంచనాలు మొత్తం వ్యయం రూ.4200 కోట్లుగా ప్రతిపాదన చేశారు. నీటి సరఫరా కోసం తయారుచేసిన ప్రణాళికల్లో వివిధ భాగాలు ఉండేలా రూపొందించారు. వాటిని ఏడు సెగ్మెంట్‌లుగా విభజించి ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా కోసం హెడ్‌వాటర్‌ వర్క్సును ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఆయా గ్రామాలకు పైప్‌లైన్‌ ద్వారా తాగునీరు వెళ్ళేలా రూపకల్పన చేశారు. ప్రస్తుత జనాభా 41.90 లక్షలు (2011 జనాభా లెక్కలు) ఉండగా 2051 నాటికి 62.38 లక్షల మంది పెరుగుతారని అంచనా వేశారు. ప్రస్తుత ప్రతిపాదిత ప్రాజెక్టు రెండేళ్ళలో పూర్తి చేస్తే ప్రారంభంలో 5.261 టీఎంసీల నీరు సరిపోతుంది. 2051 నాటికి 7.279 టిఎంసీలు నీరు అవసరం అవుతుందని ఇందులో అంచనా వేశారు.
శుద్ధి ఇలా చేస్తారు..
స్టేజ్‌-1 గోదావరి వద్ద గుర్తించిన పాయింట్లు నుంచి పంప్‌ హౌస్‌లోకి నీటిని పంపుతారు.
  
స్టేజ్‌-2 మరో ట్యాంకుకు నీటిని తరలించి ఆలం కలిపి మురుగును తొలగిస్తారు.
 
స్టేజ్‌-3 క్లోరినేషన్‌ చేస్తారు.
 
స్టేజ్‌-4 క్యారీప్లోక్యూలేటర్‌లోకి నీటిని మళ్ళించి అక్కడ మరో ప్రక్రియలో శుద్ధి చేస్తారు.
 
స్టేజ్‌-5 చివరిగా ర్యాపిడ్‌ శాండ్‌ ఫిల్టర్‌లోకి మళ్ళించి శుద్ధి చేస్తారు.
 
స్టేజ్‌-6 శుద్ధి చేసిన నీటిని మరో ట్యాంకులోకి పంపిస్తారు.
 
స్టేజ్‌-7 ఇక్కడి నుంచి పైపులైన్ల ద్వారా గ్రామాల్లో ఓహెచ్‌ఆర్‌ ట్యాంకులకు మళ్ళిస్తారు.
 
స్టేజ్‌-8 ఈ ట్యాంకుల నుంచి పబ్లిక్‌ ట్యాప్‌లకు, గృహాలకు నీటిని పంపిణీ చేస్తారు.
 
విజ్జేశ్వరం రిజర్వాయర్‌ పరిధిలోని సెగ్మెంట్‌లు
 
సెగ్మెంట్‌-1లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నరసాపురం, పాలకొల్లు, ఆచం ట, తణుకు, భీమవరం కొంత భాగం ఉన్నాయి. వీటి పరిధిలో మండలాలు మొగ ల్తూరు, నరసాపురం, యలమంచిలి, పాలకొల్లు, పోడూరు, ఆచంట, పెనుమంట్ర, పెను గొండ, ఇరగవరం, మండలాలు ఉన్నాయి. తణుకు, పాలకొల్లు, నరసాపురం పట్టణాలు ఉన్నాయి.
 
సెగ్మెంట్‌-2లో తణుకు పరిధిలో ఉండి నియోజకవర్గం, భీమవరం కొంత, తణుకు కొంత భాగం ఉన్నాయి. అత్తిలి, పెరవలి, పాలకోడేరు, ఉండి, కాళ్ళ, ఆకివీడు, వీరవాసరం, భీమవరం మండలంతోపాటు పట్టణం ఉంది.
 
సెగ్మెంట్‌-3లో ఉన్న ఏలూరు సెగ్మెంట్‌ పరిధిలో తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం, భీమడోలు, ఉంగుటూరు, దెందులూరు, పెదవేగి, పెదపాడు, ద్వారకా తిరుమల, ఏలూరు మండలాలు ఉన్నాయి.
 
సెగ్మెంట్‌-4 ఉన్న నిడదవోలు సెగ్మెంట్‌లో నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాలు, నిడదవోలు పట్టణం ఉంది.
 
కొవ్వూరు నది ప్రాంతం(అరికిరేవుల)లో
కొవ్వూరు సెగ్మెంట్‌-5 ఉంది ఇందులో రెండు మండలాలు కొవ్వూరు, చాగల్లు మండలాలు ఉన్నాయి.
  
ప్రక్కిలంక గోదావరి నదీ ప్రాంతంలో
ప్రక్కిలంక సెగ్మెంట్‌-6 ఉంది. ఇక్కడ ఒక్క తాళ్ళపూడి మండలానికి నీరు అందిస్తారు.
పోలవరం రిజర్వాయర్‌ పరిధిలో పోలవరం సెగ్మెంట్‌-7 ఉంది. దీని పరిధిలో 15 మండ లాలు పోలవరం, గోపాలపురం, కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం, చింతలపూడి, టి.నర సాపురం, లింగపాలెం, జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, దేవరపల్లి, వేలేరుపాడు, కుక్కు నూరు, జిలుగుమిల్లి, నల్లజర్ల మండలాలు ఉండగా ఒక రిజర్వాయర్‌ నిర్మాణం నిర్మిస్తారు.
 
2051 నాటికి జనాభా అంచనాలు, అవసరాలు
నీటి వనరు ప్రాంతం 2011 2021 2036 2051 మొత్తం
టీఎంసీలు
 
విజ్జేశ్వరం రిజర్వాయర్‌ 30.21 33.37 38.75 44.98 5.261
కొవ్వూరు రివర్‌ పాయింట్‌ 2.06 2.28 2.64 3.07 0.345
ప్రక్కిలంక రివర్‌ పాయింట్‌ 0.24 0.26 0.31 0.35 0.085
పోలవరం రిజర్వాయర్‌ 9.39 10.36 12.03 13.97 1.588
మొత్తం జనాభా (లక్షల్లో) 41.90 46.27 53.79 62.38 7.279....