మహాబూబాబాద్ , 11 సెప్టెంబర్ 2019
ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని అందుకోసం వైద్యులు, ప్రజలు వైద్య సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ పై మహబూబాబాద్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టర్ శివ లింగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్, జెడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, ఎంపీ మలోతు కవిత, ఎమ్మేల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణకు వైద్య ఆరోగ్య శాఖ అంకితభావంతో పని చేయాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో కు మురికి కూపాలను శుభ్రం చేయాలని తెలిపారు. ఇప్పటి పరిస్థితుల్లో రెండు చాలెంజ్ లు ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో ప్రబలిన
విష జ్వరాల ను నివారించుటకు చర్యలు తీసుకోవడంతో పాటు, విష జ్వరాలతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. అందుకుగాను, పంచాయతీ రాజ్, మున్సిపల్,, వైద్య ఆరోగ్య, విద్యాశాఖ సమన్వయంతో జిల్లాలో విష జ్వరాలు ప్రబలకుండా ప్రజల్లో అవగాహన కల్పించుటకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను సూచించారు. వైరల్ జ్వరాలు డెంగ్యూ, మలేరియా కాదని ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి అవగాహన కల్పించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించుటకు విస్తృత ప్రచారం చేయాలని, అందుకుగాను గోడ ప్రతులు పోస్టర్ లతోపాటు, వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించి విష జ్వరాలు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తృత హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ముందస్తుగా రోగాన్ని పసికట్టి త్వరగా చికిత్స ఇవ్వడంతోపాటు గ్రామాల నుండి ప్రజలకు జిల్లా ఆస్పత్రికి రాకుండా చేయవచ్చన్నారు. ఆస్పత్రికి ప్రజలు విశ్వాసంతో వస్తారని, వారి విశ్వాసాన్ని వమ్ము కలిగించకుండా అంకితభావంతో వైద్యులు వైద్యసేవలు అందించాలన్నారు. సీజనల్ వ్యాధుల వల్ల జిల్లా ఆస్పత్రిలో అధిక రోగులు వస్తున్నందున, అవసరం అయితే తాత్కాలికంగా కొన్ని బెడ్స్ ఏర్పాటు చేసి చికిత్స అందించాలన్నారు.
ప్రస్తుత వాతావరణ మార్పులతో వ్యాధులు ఎక్కువగా ప్రభలుతున్నాయి. వీటి నివారణకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని, మెరుగు పరచాలని ఆసుపత్రి సూపర్డెంట్ ను మంత్రి ఆదేశించారు. ఆసుపత్రికి పేషెంట్స్ వస్తే ఇంటి వాతావరణం మరిపించేలా ఉండాలన్నారు. ఆసుపత్రులను వైష్ణవాలయం గా తీర్చిదిద్దాలన్నారు. ప్రభుత్వ వైద్యులు చిత్తశుద్ధితో రోగులకు వైద్య చికిత్స అందించాలన్నారు. ఆసుపత్రులు రోగాలు నయం చేసే కేంద్రంగా ఉండాలన్నారు.
ప్రభుత్వాసుపత్రిలో గర్భిణులకు సాధారణ ప్రసవం జరిగేలా డాక్టర్లు కృషి చేయాలన్నారు. సిజేరియన్ వల్ల జరిగే ఆరోగ్య సమస్యల గురించి గర్భిణులకు వివరించి వారిలో చైతన్యం కల్పించాలన్నారు.
అన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 53 ఆస్పత్రుల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామన్నారు.
గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా పాఠశాలల్లో, ఆసుపత్రుల్లో, వసతిగృహాల్లో నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రత పాటించాలన్నారు.
రాష్ట్ర, పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యంగా ఉంటామని, పారిశుధ్యం తో ముఖ్యంగా వైరల్ జ్వరాలు రాకుండా ఉంటాయన్నారు. ఆసుపత్రికి వస్తున్న ప్రతి ఒక్కరికి సేవాభావంతో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
మహబూబాబాద్ మున్సిపాలిటీ లో పరిశుభ్రత బాగాలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ పరిశుభ్రత మెరుగుపడాలని అన్నారు. వారం రోజుల్లోగా ఇక్కడ నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రంగా చేయాలని అన్నారు.అన్ని గ్రామాల పారిశుధ్యం, పచ్చదనం, పరిశుభ్రత... సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమానికి రూప కల్పన చేశారని చెప్పారు.
అన్ని గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా నిర్వహించుకోవాలి మంత్రి అన్నారు.
జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో డాక్టర్లు ఉన్నారని, మందులు కూడా అందుబాటులో ఉన్నాయని, గిరిజన ప్రాంతంలో జ్వరం ప్రబలకుండా అరికట్టడం తో పాటు, రోగులను అందర్నీ చికిత్స అందించి కాపాడుకోవాలన్నారు
మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి లాగా హైజినిక్ గా ఉంచాలని ఆదేశించారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ అంకితభావంతో సేవలు అందించాలన్నారు.
ఎంజీఎం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశాం. అక్కడ వైద్యుల హాజరుకు బయోమెట్రక్ విధానం ప్రవేశ పెట్టాలని ఆదేశించామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ శివ లింగయ్య మాట్లాడుతూ జిల్లాలోని 19 పీహెచ్సీలలో డాక్టర్లు ఉన్నారని తెలిపారు. ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని మండల ప్రత్యేక అధికారి గా నియమించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పకడ్బందీగా అమలు జరిగేలా తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత పాటించడం జరుగుతున్నదని, జిల్లాలోని పది పీహెచ్సీలకు కాయకల్ప అవార్డులు వచ్చాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు ఏపీ డే మిక్స్ ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత సంవత్సరం 127 డెంగ్యూ కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 4 కేసులు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఏజెన్సీ లోని ఇరవై ఆరు వందల గృహాలకు కాలు రాకుండా స్ప్రే చేయించడం జరిగిందన్నారు. వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి, మంచినీటి samples సేకరించి చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 81 శాతం సాధారణ ప్రసవాలు జరిగాయని కలెక్టర్ వివరించారు. ప్రతి పీహెచ్సీలో ఏఎన్ఎం ల ద్వారా మహిళ గర్భం దాల్చిన అప్పటినుండి ప్రసవం అయ్యే వరకు మొత్తం వివరాలు సేకరించి పర్యవేక్షిస్తున్న ట్లు కలెక్టర్ తెలిపారు.
డోర్నకల్ శాసనసభ్యులు రెడ్డి నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ ప్రాంతంలో 50 శాతం గిరిజనులు, పేదరికం అందువల్ల మలేరియా, డెంగ్యూ వంటి రోగాలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉందన్నారు. సరేనా పరిశుభ్రత, సానిటేషన్ లేనందువల్ల జ్వరాలు ప్రబలుతున్నాయి అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా జిల్లాను స్పెషల్ కేస్ గా గుర్తించి అధికంగా నిధులు కేటాయించి నట్లయితే ఆసుపత్రి అభివృద్ధి చేసుకోవడం తో పాటు మెరుగైన వైద్యం అందించవచ్చు అన్నారు.
మహబూబాబాద్ శాసనసభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిని వంద పడకల నుండి 300 పడకల కు మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది, పరికరాలతో కొరత ఉందని, వెంటనే కొలతలు తీర్చుటకు తీసుకోవాలన్నారు. గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేయకుండా సిజేరియన్ చేస్తున్నారని, అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం rotavirus వ్యాక్సిన్ను పలువురు చిన్నారులకు మంత్రులు ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు లు వేసి ప్రారంభించారు.
ఈ:సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస రావు, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీ రామ్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భీమ్ సాగర్, ప్రభుత్వ వైద్యులు, అన్ని శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
––––––––