విశాఖపట్నం : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటి సభ్యునిగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నియమితులయ్యారు
ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఎంవీవీ కి స్థానం కల్పించారు. ఉభయసభల కు (లోక్ సభ,రాజ్యసభ) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చైర్మన్ గా డాక్టర్ శశిథరూర్ వ్యవహరించనుండగా,లోక్ సభ కు 21 ,రాజ్యసభ కు 10 మంది సభ్యుల చొప్పున మొత్తం 31 మందికి స్థానం కల్పించారు.ఇందులో ఆంధ్రప్రదేశ్ లోక్ సభ స్థానాలలో విశాఖ ఎంపీ ఎంవీవీ గారికి స్థానం లభించింది.ఈ విషయం పై ఎంపీ గారు స్పందిస్తూ తనపై నమ్మకంతో అప్పగించిన ఈ పదవికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానన్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.ఈ నేపధ్యం లో ఆ రంగ పురోగాభివృద్ధి సాధించాల్సిన అవసరంపై దృష్టిసారిస్తానన్నారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటి సభ్యునిగా విశాఖ ఎంపీ