ఏపీ సచివాలయం వద్ద ఉద్రిక్తత
అమరావతి: సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ ఈడీ సాంబశివరావును సబ్ కాంట్రాక్టర్లు, సామాగ్రి పంపిణీదారులు, ఉద్యోగులు అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు గతంలో ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ కాంట్రాక్టర్‌గా ఉంది. రూ.23 కోట్ల బకాయిలు చెల్లించకుండా ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ ఈడీ సాంబశివరావు వేధిస్తున్నారని ఆందోళనకు దిగారు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రెండున్నరేళ్లుగా బకాయిలు చెల్లించడంలేదని సబ్ కాంట్రాక్టర్లు, సామాగ్రి పంపిణీదారులు, ఉద్యోగులు అంటున్నారు. హైదరాబాద్‌లోని ఆఫీస్‌కు వెళ్తే పోలీసులతో బయటికి గెంటిస్తున్నారని, సగం బిల్లుల చెల్లింపునకు ఒప్పుకోవాలని బలవంతంగా రాయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బాధతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారని, సీఎం జగన్ కల్పించుకుని బకాయిలు చెల్లించేలా చేయాలని సబ్ కాంట్రాక్టర్లు, సామాగ్రి పంపిణీదారులు, ఉద్యోగులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాక చెల్లిస్తామని ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ఈడీ సాంబశివరావు అంటున్నారు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతున్నామని, బిల్లులు పాస్ కాగానే ఎండీ శ్రీధర్‌తో మాట్లాడి బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. 73 మందికి బకాయిలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. కంపెనీ ఇబ్బందుల్లో ఉండటం వల్ల చెల్లించలేకపోయామని తెలిపారు. ఉద్యోగుల బకాయిలు, పీఎఫ్‌లు కూడా చెల్లిస్తామని సాంబశివరావు స్పష్టం చేశారు.
ఏపీ సచివాలయం వద్ద ఉద్రిక్తత