కేసులు ఉపసంహరించుకోవాలి:తంగిరాల సౌమ్య

తేది 05-09-2019


విలేకరుల సమావేశం వివరాలు


వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఘటన విషయంలో అనవసరంగా కేసులు పెట్టారు


 ఈ కేసులు ఉపసంహరించుకోవాలి


- మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య


గుంటూరు జిల్లా అనంతవరంలో జరిగిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి సంఘటనలో తప్పుడు కేసులు పెట్టారని, దీనిని ఖండిస్తున్నామని, ఈ కేసులు ఉపసంహరించు కోవాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. గురువారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి దర్శనం కూడా చేసుకోలేదని వైసీపీ నాయకులు ఆరోపణ చేశారని, ఇది అవాస్తవమన్నారు. దర్శనం చేసుకొని ప్రసాదం కూడా స్వీకరించినట్లు ఫొటోలున్నాయన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి వినాయక దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకున్న తరువాత వైసీపీ లీడర్‌ అశోక్‌ తండ్రిని ఎమ్మెల్యేగారి పీఏ తోసేయడం జరిగిందన్నారు. మిగతా నాయకులందరూ కూడా ఎమ్మెల్యే గో బ్యాక్‌... గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేయడం జరిగిందని చెప్పారు. ఇక్కడి దృశ్యాలు చూస్తే టీడీపీ కార్యకర్తలకుగానీ, నాయకులకుగానీ ఈ ఘటనతోఎలాంటి సంబంధం లేదన్నారు. అనవసరంగా తెలుగుదేశం నాయకులపై ఎస్‌సి, ఎస్‌టి కేసులు పెట్టడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి తాము క్రిష్టియన్లు అని చెప్పడం జరిగింది. అలాంటప్పుడు ఎస్‌సి, ఎస్‌టి కేసులు ఏ విధంగా పెట్టారని ప్రశ్నించారు.  ఎస్‌సి, ఎస్‌టి కేసు 34 మందిపైన ఏ విధంగా పెట్టారన్నారు? ఇవన్నీ పరిశీలించి కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ దళితులకి అత్య్తున్నత స్థానం కల్పిస్తూ వచ్చిందన్నారు. ఒకసారి చరిత్రను అవలోకనం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎందరో దళితులని నాయకులుగా తీర్చిదిద్దడం జరిగింది. దళిత నాయకులకు, దళిత మహిళలకు పెద్దపీట వేస్తూ వచ్చాము. ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్‌ని చేయడంలోనూ, బలయోగి గారిని లోక్‌సభ స్పీకర్‌ని చేయడం టీడీపీ హయాంలోనే జరిగింది. అమరావతిలో అంబేద్కర్‌ 120 అడుగుల పైగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చంద్రబాబునాయుడుగారు కృషిచేశారు. ఎప్పుడు దళితుల కోసం పనిచేస్తూ వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యే శ్రీదేవి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలు. నిజాలు చెప్పండి. సీఎం ఆఫీసు నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ చదవడంకాదన్నారు. పద్ధతులు మార్చుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు.


Popular posts
*వింజమూరు ప్రజలు జాగ్రత్తలు వహించండి* డాక్టర్ రమేష్.... వింజమూరు, సెప్టెంబర్ 22 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి పట్ల తగు జాగ్రత్తలు వహించాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైధ్యాధికారి డాక్టర్ రమేష్ కోరారు. ఇప్పటివరకు మండలంలో 500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. అయితే అదే స్థాయిలో బాధితులు కోలుకుంటుండటం సంతోషకరమైన విషయమన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ వైరస్ పట్ల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం శ్రేయస్కరం కాదన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టడం వలన వైరస్ ప్రబలేందుకు పరోక్షంగా దోహదపడుతున్నామన్నారు. కనీస జాగ్రత్తలు పాటించిన పక్షంలో కరోనాను అంతమొందించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రతి నిత్యం వేడి వేడి ఆహార పదార్ధాలను భుజించడం, దాహం వేసినప్పుడు గోరువెచ్చని నీటిని సేవించడం, యోగా, ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి సూచనలను ప్రతి ఒక్కరూ విధిగా అలవాటు చేసుకోవాలన్నారు. వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేష్ తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
Image
ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్‌
16 న చిన్న, మధ్యతరహా పత్రికల రాష్ట్ర మహాసభ : మల్లెల      
చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో నారాయణ రెడ్డి మృతి పట్ల మంత్రి సంతాపం
కరోనా నియంత్రణకు దక్కన్ టూబాకో కంపెనీ  గ్రూప్
Image