మల్లాం రోడ్లన్నీ జలదిగ్బంధం.....

మల్లాం రోడ్లన్నీ జలదిగ్బంధం......!


బ్రహ్మోత్సవాల వేళ ఉత్సవమూర్తుల ఊరేగింపుకు ఆటంకం ......!


చిట్టమూరు మండలం మల్లాం లోని అంతర్గత రహదారులు జలదిగ్బంధంలో ఉన్నాయి . మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.


 స్వయంభు వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 14 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మల్లాంలో గ్రామోత్సవం, ఉత్సవమూర్తుల ఊరేగింపు సందర్భంగా ఆటంకాలు ఏర్పడుతున్నాయి.దీనిపై స్థానికులు ఆవేదన చెందుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం నిర్మించిన ఆర్ అండ్ బి రహదారి  ఎత్తు పెంచి నిర్మాణం చేపట్టడం,సైడు కాలువలు లేకపోవడంతో ఎక్కడ నీళ్లు అక్కడే నిలిచి  పోయాయి. మల్లాం రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో రోడ్లన్నీ జలమయమై రాకపోకలకు అంతరాయం ఏర్పడి ఆటంకంగా మారడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు  స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఉన్నతాధికారులు  వెంటనే చొరవచూపి నీళ్లు వెళ్లేందుకు మార్గాలను ,సైడు కాలువలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.