దేవుడి ప్రతి రూపాయికి జవాబు దారిగా పని చేస్తాం

దేవుడి ప్రతి రూపాయికి జవాబు దారిగా పని చేస్తాం.


దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.


విజయవాడ.
తేదీ.23.09.19


చంద్ర బాబు నాయుడు తన వారికి కాంట్రాక్టర్ల పేరుతో దేవుడి సొమ్మును అడ్డగోలుగా దోచుకున్నారని, వై యస్ అర్ సిపి ప్రభుత్వం దేవుడి ప్రతి రూపాయికి జవాబు దారిగా పని చేస్తుందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. 


 దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక ను బ్రాహ్మణ విదిలోని మంత్రి తన కార్యాలయం లో ఆదివారం ఆవిష్కరించారు.


 ఈ నెల 29 నుంచి అక్టోబర్ 8 వ తేదీ వరకూ దసరా ఉత్సవాలను ప్రభుత్వం అత్యంత వైబవం గా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు.


 మూల నక్షత్రం రోజు సిఎం జగన్ ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు


 గత ప్రభుత్వం దసరా ఉత్సవాల్లో ప్రచార ప్రకటనల కే పరిమిత మైందని ఈ ఏడాది దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తా మన్నారు, 


 దసరాకి నలుమూలల నుంచి వచ్చే భక్తుల సౌకర్యాల కు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు, 


 ప్రతి భక్తుడు వి ఐ పి నే అనే విధంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.


 ఈ నెల 25 వ లోపు దసరా ఏర్పాట్లు పూర్తి చేయాలనే లక్ష్యం తో అన్ని విభాగాల అధికారులతో కలిసి పనిచేస్తున్నాం అన్నారు, 


మీడియా సమావేశం లో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం గా దేవాలయాల్లో రాజకీయాలకు తావులేదన్నారు...


కొంత మంది ఇంద్రకీలాద్రి పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని చంద్ర బాబు కు, అవినీతి పరులకు వంత పాడుతున్నారన్నరు, 


 అమ్మవారి ఆలయ నిధులు దుర్వినియోగం జరగకుండా జాగ్రత్త లు పాటిస్తున్నా మాన్నరు.


 గత ప్రభుత్వం పవిత్ర సంగమం వద్ద హారతులు పేరిట ఆగమ శాస్త్రాన్ని విరుద్దం గా నిధులను దోచి పెట్టిందన్నారు.


 రాష్టం లోని అన్ని దేవాలయాలకు పాలక మండలాలకు త్వరలో నియమిస్తామన్నారు.


ఈ సంవత్సరం దాదాపు 15 లక్షల మంది అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు, అంచనాతో అన్ని శాఖల అధికారులతో సమన్వంతో పనులు చేపట్టినట్లు తెలిపారు.


 సమావేశం లో కొనకళ్ల విద్యాద్దర రావు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి ఎమ్ వి సురేష్ బాబు, ఆలయ ప్రధాన అర్చకులు లింగం బొట్ల దుర్గా ప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు అర్ శ్రీనివాస శాస్త్రి ఆలయ సహాయ కార్య నిర్వాహన అధికారులు ఎన్ రమేష్, బి. వెంకట రెడ్డి, తిరుమలే శ్వరరావు తదితరులు పాల్గొన్నారు.