కుల సర్టిఫికేట్ల వివాదాలను పరిష్కరించేందుకు కమిషన్‌

కుల సర్టిఫికేట్ల వివాదాలను పరిష్కరించేందుకు కమిషన్‌
అమరావతి : పలు కులాల సర్టిఫికేట్ల వివాదాలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జేసీ శర్మకు ఈ కమిషన్‌ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు గురువారం సాంఘీక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బేడ, బుడగ జంగం కులాలను ఎస్సీ కేటగిరీలో చేర్చే అంశంపై, బోగస్‌ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్లను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఆదేశించింది. శ్రీకాకుళం జిల్లాలోని బెంతో, ఒరియా కులాలకు ఎస్టీ సర్టిఫికేట్‌ ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలని, ఇతర కులాలవారు ఎస్సీ, ఎస్టీ తప్పుడు ధ్రువపత్రాలు పొందకుండా సూచనలు చేయాలని ఆదేశించింది.