సుజనా అడిగితే సీఎం వచ్చి చెప్పాలా?

సుజనా అడిగితే సీఎం వచ్చి చెప్పాలా?
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన తెలిపారు. మంత్రి బొత్స గురువారం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లడారు. 'ప్రతిపక్షం పెయిడ్‌ ఆర్టిస్టులతో గందరగోళం సృష్టించాలని చూస్తోంది. చిన్న చిన్న తగాదాలను భూతద్ధంలో చూపించే ప్రయత్నం చేస్తోంది. కావాలనే కొన్ని పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయి. వందరోజుల పాలనలో సీఎం జగన్‌ సంక్షేమానికి పెద్దపీట వేశారు. దేవుని దయతో ప్రాజెక్టులు అన్నీ జలకళతో ఉన్నాయి. కొద్ది రోజుల్లో లక్షా 34వేల మంది గ్రామ కార్యదర్శులు విధుల్లో చేరబోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు వలంటీర్లను నియమించాం' అని తెలిపారు. వరద ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని మంత్రి బొత్స పేర్కొన్నారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. 'నాలుగున్నర ఏళ్లుగా పట్టించుకోకుండా, ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు 36వేల కోట్ల నిర్మాణాలకు రాజధానిలో టెండర్లు పిలిచారు. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పలేదు. రాజధాని ఓ ఒక్క సామాజిక వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో చెందినది కాదు. గత ప్రభుత్వం ఆరువేల కోట్లకు పైగా రాజధానిలో ఖర్చు చేసినట్లుగా చూపించింది. ఆ నిధులు ఏమయ్యాయో తేలాల్సి ఉంది. నిన్నటి వరకు టీడీపీలో ఉన్నవారే రాజధానిపై గందరగోళం సృష్టిస్తున్నారు. సుజనా చౌదరి అడిగితే ముఖ్యమంత్రి వచ్చి చెప్పాలా? పార్టీ కండువా మారింది తప్ప సుజనా ఆలోచన మారలేదని, పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం ఫ్యాషన్‌ అయింది' అంటూ ఎద్దేవా చేశారు. సుజనా మూలాలు ఇంకా టీడీపీలోనే ఉన్నాయని  బొత్స తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


Popular posts
87-88 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థుల కలయిక
Image
*పేదలకు వరప్రసాదినిలా 108, 104 సేవలు* తిప్పిరెడ్డి.నారపరెడ్డి..... వింజమూరు, జూలై 1 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం లాంచనంగా ప్రారంభించిన 108, 104 అంబులెన్సు వాహనాలు పేద వర్గాల ప్రజలకు వరప్రసాదినిగా మారనున్నాయని మండల వై.సి.పి కన్వీనర్ తిప్పిరెడ్డి.నారపరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలో వై.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 108, 104 సేవలను విస్తరించనున్నామని హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ నేపధ్యంలో దాదాపుగా 201 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి 1088 అంబులెన్సు వాహనాలను విజయవాడలోని బెంజి సర్కిల్ కూడలి వద్ద ప్రారంభించడం అభినందనీయమని నారపరెడ్డి కొనియాడారు. దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నాడు ఆరోగ్యశ్రీతో పాటు 108 వాహనాలను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. కాలక్రమేణా 108 వాహనాల వ్యవస్థ మరుగున పడి వాటి మనగడే ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్ తండ్రి బాటలో పయనిస్తూ ఒకేసారి 1088 అంబులెన్సు వాహనాలను ప్రజలకు సేవ చేసేందుకు ప్రారంభించి అటు తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ ఇటు ఆపదలలో ఉన్నవారికి ఆపద్భాంధవునిలా నిలిచారన్నారు. ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో ఈ అంబులెన్సు వాహనాలు త్వరలోనే ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కేటాయించనున్నారని నారపరెడ్డి తెలియజేశారు. ప్రజల సం క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న యువ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పధకాలతో పాటు అదనంగా కొత్త పధకాలకు శ్రీకారం చుడుతుండటం గొప్ప విషయమన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ప్రజల సం క్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందిస్తున్న సి.యం జగన్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారని తిప్పిరెడ్డి.నారపరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Image
హర్జిత్ సింగ్ పోరాట పటిమ పోలీసు శాఖ కు ఆదర్శం : డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ IPS
Image
చనిపోయాక కూడా ఆవ్యక్తికి మనశ్శాంతి లేకుండా దుష్ప్రచారమా?
గుండెపోటుతో మరణించిన వాలంటీర్ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం: సీఎం  వైయస్.జగన్
Image