ఇడిమేపల్లి భూవివాదానికి సంబంధించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలీసులకు పంపిన వాంగ్మూలం

*ఇడిమేపల్లి భూవివాదానికి సంబంధించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలీసులకు పంపిన వాంగ్మూలం*


ఈ క్రింది వాంగ్మూలము క్రైమ్ నంబర్ 212/2019, వెంకటాచలం పోలీసుస్టేషన్ లో రిజిస్టర్ కాబడిన కేసుకు సంబంధించి ఇవ్వబడినది.


వెంకటాచలం మండలం ఇడిమేపల్లి సర్వే నంబర్ 58/3లోని ఎ 2.41 సెంట్ల భూమి గురించి ఏలూరు రంగారెడ్డి గారు చట్టబద్ధం కాని వివాదం లేవదీశారు. ఈ భూమి వారికి వంశపారపర్యంగా అనుభవంలో ఉన్నదని చెప్పుచున్నారు. కానీ అది ఎంతమాత్రం నిజం కాదు. ఇడిమేపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 58/3 లోని ఎ 4.82 సెంట్ల విస్తీర్ణం గల పొలం శ్రీమతి అర్వభూమి రాగమ్మ ఉరఫ్ మీనమ్మ గారికి చెందియుండినది. ఆమె సదరు సర్వే నంబరులోని ఎ 4.82 సెంట్ల భూమిని ఓఎస్ నంబర్ 147/1925 దావాకు సంబంధించిన ఈపీ నంబరు 489/1932లో గౌరవ నెల్లూరు డిస్ట్రిక్ట్ మున్సిఫ్ కోర్టు డిక్రీ ద్వారా పొందియుండినారు. లేట్ పామూరు పిచ్చిరెడ్డి గారి కుమారులైన పామూరు వెంకురెడ్డి గారు, పామూరు వెంకటసుబ్బారెడ్డి గారు మరియు సదరు పిచ్చిరెడ్డి గారి ఏకైక కుమార్తె రంగమ్మ గారి భర్త అయిన నెల్లూరు రంగారెడ్డి గారు తదితరులకు చెందిన ఆస్తిని నెల్లూరు డిస్ట్రిక్ట్ మున్సిఫ్ కోర్టు వారి ద్వారా మీనమ్మ గారు సేల్ సర్టిఫికెటు పొందివున్నారు.. ఆ సమయంలో పామూరు వెంకురెడ్డి, పామూరు వెంకటసుబ్బారెడ్డి మైనర్లు అయినందున నెల్లూరు రంగారెడ్డి గారు వారి గార్డియన్ గా వ్యవహరించినారు. నెల్లూరు రంగారెడ్డి గారు వీరితో పాటు రామచంద్రారెడ్డి మరియు రామిరెడ్డి గార్లకు కూడా గార్డియన్ గా వ్యవహరించారు. కోర్టు డిక్రీ ద్వారా ఎ 50.29 సెంట్ల భూమిని 1933 సెప్టెంబర్ 4వ తేదీన అర్వభూమి రాగమ్మ అలియాస్ మీనమ్మ గారు పొందారు. అట్లు రాగమ్మ అలిసాయస్ మీనమ్మ గారు పొందిన భూమిలో సర్వే నంబర్ 58/3కి సంబంధించిన మొత్తం విస్తీర్ణం ఎ 4.82 సెంట్ల పొలము కూడా ఉన్నది. పై విధంగా సర్వే నంబర్ 58/3లోని మొత్తం పొలం శ్రీమతి అర్వభూమి రాగమ్మ అలియాస్ మీనమ్మ గారు కోర్టు ద్వారా సంపూర్ణ హక్కులు పొంది అనుభవించుకునుచుండినారు. ఇందు వెంట పై విషయానికి సంబంధించినటువంటి గౌరవ కోర్టు వారి ఉత్తర్వులను (డాక్యుమెంట్ నంబర్ 1)జతపరుస్తున్నాం. అర్వభూమి రాగమ్మ అలియాస్ మీనమ్మ గారికి చెందినటువంటి ఈ భూముల వివరాలను 1935లో రెవెన్యూ శాఖ వారు రెవెన్యూ హోల్డింగ్ (ఆర్.హెచ్)లో కూడా నమోదు చేసియున్నారు. దీనికి సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన కాపీని జతపరుస్తున్నాను. (డాక్యుమెంట్ నంబర్ 2)


        దరిమిలా సర్వే నంబర్ 58/3లోని ఎ 4.82 సెంట్ల భూమిలోని ఎ 2.41 సెంట్ల భూమిని తన మేనల్లుడైన కట్టంరెడ్డి జయరామిరెడ్డి గారికి 1961 మార్చి 14వ తేదీన రిజిస్టర్ సెటిల్మెంట్ డీడ్ బేరింగ్ నంబరు 624/1961 ద్వారా చెందజేసియున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జతపరుస్తున్నాం..(డాక్యుమెంట్ నంబర్ 3). సదరు భూమిని కట్టంరెడ్డి జయరామిరెడ్డి గారు ఆర్టీ ట్రాన్స్ ఫర్ బేరింగ్ ఫైల్ నంబర్ 1245/1965 ద్వారా 1965లో బల్లేల కోటారెడ్డి గారికి చెందజేసియున్నారు. దీనికి సంబంధించి టెన్ 1 కాపీని జతపరుస్తున్నాం(డాక్యుమెంట్ నంబర్ 4)


        తర్వాత పై భూమిని 1983వ సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన బల్లేల కోటారెడ్డి  గారి నుంచి నేను బేరింగ్ నంబర్ 1271/1983 ద్వారా విక్రయం చేసుకున్నాను. దీనికి సంబంధించిన విక్రయ పత్రం జతపరుస్తున్నాను.(డాక్యుమెంట్ నంబర్ 5) అప్పటి నుంచి ఈ పొలం నా హక్కు అనుభవంలో కొనసాగుచుండియున్నది. ఈ భూమికి సంబంధించి రెవెన్యూ శాఖ వారు పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్ కూడా జారీ చేసియున్నారు. వీటి జెరాక్స్ కాపీలను కూడా జతపరుస్తున్నాను.(డాక్యుమెంట్ నంబర్ 6 మరియు 7).


       తర్వాత ఈ భూమిని మేనేజ్ చేయుటకు మరియు విక్రయించుటకు శ్రీమతి కట్టంరెడ్డి రాణి సంయుక్త గారికి 2008 జూలై 21వ తేదీన డాక్యుమెంట్ నంబర్ 17/2008 ద్వారా విక్రయించు హక్కు కూడా కల్పించియున్నది. ఈ పవార్ ఆఫ్ అటార్నీకి 2017 మార్చి 8వ తేదీన రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా సవరణ కూడా చేసియున్నాం. వీటికి సంబంధించి కాపీలను జతపరుస్తున్నాను.(డాక్యుమెంట్ నంబర్ 8 మరియు 9)


ఈ ఆస్తి అప్పుడు సర్వే నంబర్ 58/3లో ఉండినది.నేను కొనుగోలు చేసినప్పుడు ఈ ఆస్తికి హద్దులు ఉండినవి. ఆ హద్దులలోని విస్తీర్ణం ఎ 2.41 సెంట్లుగా ఉండినది. ఈ ఆస్తి హద్దులు కలిగి నా సంపూర్ణ హక్కు అనుభవంలో ఉన్నప్పటికినీ సబ్ డివిజన్ కలిగియుండుట మంచిదని తలచి సబ్ డివిజన్ చేయమని కోరుతూ రెవెన్యూ శాఖ వారికి దరఖాస్తు పెట్టాను. దీనికి సంబంధించిన అర్జీ, మీసేవ చలానా కాపీలను జతపరుస్తున్నాను. (డాక్యుమెంట్ నంబర్ 10 మరియు 11). రెవెన్యూ శాఖ వారు సర్వే చేసిన అనంతరం సబ్ డివిజన్ చేసి నా పొలమునకు సర్వే నంబర్ 58/3-2గా సబ్ డివైడ్ చేసినారు. (సబ్ డివిజన్ మ్యాప్ డాక్యుమెంట్ నంబర్ 12). ఈ సబ్ డివిజన్ ను ధ్రువీకరిస్తూ 2017 మే 8వ తేదీన తహసీల్దార్ వెంకటాచలం గారి లెటర్ ఆర్.సీ 178/2017 ద్వారా గూడూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తెలియజేసివున్నారు. దీనికి సంబంధించిన కాపీని జతపరుస్తున్నాను.(డాక్యుమెంట్ నంబర్ 13)


సదరు భూమిలోని ఎ 2.28 సెంట్ల విస్తీర్ణమును 2017 ఏప్రిల్ 6వ తేదీన మెస్సర్స్ శ్రీ సాయి ట్రేడర్స్ వారికి కట్టంరెడ్డి రాణీ సంయుక్త గారు జీపీఏ ద్వారా బేరింగ్ నంబర్ 1095/2017 ద్వారా విక్రయించారు. దీనికి సంబంధించిన జెరాక్స్ కాపీని కూడా జతపరుస్తున్నాను. (డాక్యుమెంట్ నంబర్ 14)


ఆ ఆస్తిని కొనుగోలు చేసిన పిదప శ్రీ సాయి ట్రేడర్స్ వారు కాంపౌండ్ వాలు నిర్మించి సదరు స్థలంలో ఓ భవనాన్ని నిర్మించి ఆ ఆస్తిని అనుభవించుకునుచున్నారు.


పైన పేర్కొన్న విధంగా 1933వ సంవత్సరంలోనే సర్వే నంబర్ 58/3లోని ఎ 4.82 సెంట్లు హక్కు పామూరు వెంకురెడ్డి, పామూరు వెంకటసుబ్బారెడ్డి, నెల్లూరు రంగారెడ్డి తదితరులు కోల్పోయినారు. అట్లు వారు కోల్పోయిన ఆస్తిని కూడా వారు తమదిగా చెలామణి చేస్తూ పంపకములు చేసుకునియున్నారని ఈ మధ్య తెలియుచున్నది. ఆ పంపకములు చట్టరీత్యా చెల్లవు. లేని పొలమును ఉన్నట్లు చూపించి పారీకత్తులు సృష్టించుకునియున్నారు. వారు తప్పు చేసి నేను అబద్ధపు రికార్డులు సష్టించానని నాపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. దురుద్దేశపూర్వకముగా నన్ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని దుష్ర్పచారం చేస్తున్నారు. దాని ఫలితమే ఈ అబద్ధపు రిపోర్టు. పై విషయము గురించి ఏలూరు రంగారెడ్డి, పామూరు రఘునాధరెడ్డి ఓఎస్ నంబర్ 211/2018 ద్వారా నెల్లూరు మూడో అదనపు జిల్లా కోర్టులో డిక్లరేటరీ సూట్ వేసియున్నారు. దీనికి సంబంధించిన దావా కాపీని జతపరుస్తున్నాను.(డాక్యుమెంట్ నంబర్ 15). సదరు సూట్ పెండింగ్ లో ఉన్నది. ఆ కోర్టులో ఈ ఆస్తి మీద హక్కు తనది నిర్ధారణ చేయమని సివిల్ కేసు వేసి అది పెండింగ్ లో ఉండగానే ఎవరు హక్కుదారులో సివిల్ కోర్టులో తేలకుండానే, సివిల్ సూటు విషయాన్ని ప్రస్తావించకుండా ఏలూరు రంగారెడ్డి గారు నాపై అబద్ధపు కేసు సష్టించి సంఘంలో నా పేరు ప్రతిష్టలు తగ్గించాలని కొందరి ప్రోత్సాహంతో రాజకీయంగా కుట్ర చేయుచున్నారు. నా దగ్గర ఆస్తిని కొనుగోలు చేసిన శ్రీ సాయి ట్రేడర్స్ వారు కూడా జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో ఓఎస్ నంబర్ 351/2019గా దావా వేసియున్నారు. ఈ దావా కాపీని కూడా జతపరుస్తున్నాను.(డాక్యుమెంట్ నంబర్ 16). సివిల్ కోర్టులో ఆస్తి వివాదం జరుగుచున్నప్పటికీ కూడా ఆ విషయమును గురించి ఎలాంటి ప్రస్తావన కూడా చేయకుండా ఈ అబద్ధపు క్రిమినల్ కేసును నాపై వేసియున్నారు.


సర్వే నంబరు 58/3 ఇడిమేపల్లి గ్రామంలోని నా హక్కు అనుభవంలో ఉన్న ఎ 2.41 సెంట్లను సర్వే చేసి సబ్ డివిజన్ చేయవలసినది అని నేను కోరుతూ రెవెన్యూ శాఖ అధికారులకు అర్జీ పెట్టినాను. దరిమిలా ఆ శాఖ వారు సర్వే చేసినారు. విస్తీర్ణం ఎ 2.41 సెంట్లను నిర్ధారించి నా అనుభవంలో ఉన్న పొలము సర్వే నంబరును 58/3-2గా సబ్ డివైడ్ చేసినారు. సబ్ డివిజన్ చేసినట్లుగా వెంకటాచలం మండలం తహసీల్దార్ గారు గూడూరు సబ్ రిజిస్ట్రార్ గారికి తెలియజేస్తూ ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి కూడా నకలు పంపించివున్నారు. అందుకుని అది సబ్ డివిజన్ అయినదని నేను నమ్ముటలో ఎలాంటి చట్టబద్ధమైన అవరోధం లేదు. కానీ ఈ సబ్ డివిజన్ నేను కుట్ర పూరితంగా రికార్డులు తారుమారు చేసి సష్టించినానని నా మీద నిరుపయోగ, నిరాధారమైన దుష్ప్రచారం చేయుట చాలా దుర్మార్గం. ఇది రాజకీయ ప్రేరేపిత కుట్ర. అందుకుని సెక్షన్ 120బీ ఐపీసీ ఏ మాత్రం వర్తించదు. నేను ఏ విధమైనటువంటి ఫోర్జరీ చేయలేదు. కనుక 468, 471వ సెక్షన్లు నేను చట్టపరంగా చేయించిన సబ్ డివిజన్ కు వర్తించవు. నా పొలమును నేను సబ్ డివిజన్ చేయించుటకు 468, 471 ఐపీసీ సెక్షన్లు ఏ మాత్రం వర్తించవు. ఎందుకనగా అది చట్టపరమైన చర్య. సబ్ డివిజన్ చేయుటలో ఏమైనా తప్పుఒప్పులుంటే సంబంధిత రైతు రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేయాల్సిందే కానీ ఈ విధంగా చట్టాన్ని దుర్వినియోగం చేయుట తగదు.


                నా పొలంలో నేను ప్రవేశించుట, నా దగ్గర కొనుగోలు చేసిన వారు ప్రవేశించుట ఏ మాత్రం చట్టవ్యతిరేకం కాదు. అందుకని సెక్షన్ 447, 427 ఐపీసీ నాకు కానీ, నా దగ్గర పొలం కొనుగోలు చేసిన వారికి కానీ వర్తించదు. నేను ఇతరుల ఆస్తిని దొంగతనంగా తీసుకుని పోలేదు. కనుక సెక్షన్ 379 ఐపీసీ కింద చేసిన నేరారోపణ నిరాధారం. పైపెచ్చు ఈ వివాదంలో ఉన్న భూమి మీద హక్కు ఎవరిదో తేల్చమని వై.రంగారెడ్డి గారు నెల్లూరు మూడవ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఓఎస్ నంబర్ 211/2018 దావా వేసియున్నారు. కనుక పాత సర్వే నంబరు 58/3 ప్రస్తుత సర్వే నంబరు 58/3-2 వివాదగ్రస్తమైవున్నది. కోర్టులో వ్యాజ్యములో ఉన్నది. ఈ వ్యాజ్యము తేలక ముందు కానీ ఏ విధమైన క్రిమినల్ కేసు వేయడం చట్టరీత్యా కుదరదు. పోలీసు వారు టైటిట్ ను నిర్ణయించలేరు. కనుక ఈ ఫిర్యాదు కుట్రపూరితంగా నా పేరు ప్రఖ్యాతులను దెబ్బతీయుటకు చేసిన దుర్మార్గపు ప్రయత్నం. నా దగ్గర ఈ పొలమును కొనుగోలు చేసిన వారు ఎ 2.28 సెంట్ల చుట్టూత ప్రహరీ నిర్మించి, అందులో బిల్డింగ్ కట్టుచున్ననూ నోరు మెదపక ఎందుకున్నారు. కనుకనే ఈ ఫిర్యాదు నిరాధారమైనది మరియు కుట్రపూరితమైనది. అందుకుని ఈ సివిల్ వ్యవహారములో పోలీసు వారు ఎలాంటి జోక్యం చేయకుండా ఫిర్యాదును కొట్టివేయుదురని ఆశిస్తున్నాను..


     (సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి)


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image