అమరావతి : జగన్ ప్రభుత్వ వంద రోజుల పాలనపై టీడీపీ చార్జిషీటు విడుదల చేయనుంది. గుంటూరులోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు శనివారం దీనిని విడుదల చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. వంద రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలు, వ్యవస్థల పతనం, రివర్స్ పాలన, అరాచకాలను ఎత్తి చూపుతూ ఈ చార్జిషీటును రూపొందించినట్లు సమాచారం.
జగన్ ప్రభుత్వంపై నేడు టీడీపీ చార్జిషీటు