సీఎం వైఎస్‌ జగన్‌ ను కలిసిన పివి సింధు

13.09.2019
అమరావతి


– సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ ను కలిసిన పివి సింధు
– పివి సింధును అభినందించిన ముఖ్యమంత్రి 
– బ్మాడ్మింటన్‌ అకాడమీకి భూమి కేటాయించాలని కోరిన సింధు
– విశాఖపట్నంలో 5 ఎకరాలు కేటాయిస్తామని సీఎం హామీ: మంత్రి ముత్తంశెట్టి
– పివి సింధును అన్నిరకాలుగా ప్రోత్సహిస్తామన్నారు: మంత్రి ముత్తంశెట్టి
– సీఎంను కలవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన పివి సింధు
– అకాడమికి భూమి కేటాయిస్తామనడం పట్ల హర్షం.
– భవిష్యత్తులో అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని సీఎం హామీ ఇచ్చారు: సింధు


అమరావతి:
ప్రపంచ బ్మాడ్మింటన్‌ ఛాంపియన్‌ పివి సింధు వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ ను కలిసారు. క్రీడాశాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పివి సింధు తల్లిదండ్రులు పివి రమణ, లక్ష్మి, క్రీడాసంఘాల ప్రతినిధి ఛాముండేశ్వరీనాద్, అధికార భాషాసంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, శాప్‌ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ ను కలిసారు. ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్‌ పోటీల్లో సాధించిన బంగారు పతకంను ముఖ్యమంత్రికి చూపించారు. ఈ సందర్బంగా సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ ఆమెను అభినందించారు. పివి సింధును శాలువతో సత్కరించారు. అనంతరం సెక్రటేరియట్‌ లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలసి పివి సింధు మీడియాతో మాట్లాడారు.
ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంఫియన్‌ పివి సింధు మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తనను అభినందించడం సంతోషంగా వుందని అన్నారు. భవిష్యత్తులోనూ ఎప్పుడూ అండగా వుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే విశాఖపట్నంలో 5 ఎకరాల భూమిని కేటాయిస్తామని చెప్పడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలవడం పట్ల ఆనందంగా ఉందన్నారు. పద్మభూషణ్‌ కోసం కేంద్రం తన పేరును నామినేట్‌ చేసినట్లు తెలిసిందని, చాలా సంతోషంగా ఉందన్నారు. దీనిపై ఇంకా అధికారికంగా సమాచారం రాలేదని తెలిపారు. 
గోల్డ్‌ మెడల్‌ సాధించిన∙తరువాత మొట్టమొదటి సారిగామన రాష్ట్రానికి వచ్చిన బ్యాడ్మింటెన్‌ క్రీడాకారిణి పివి సింధుకు ఘనంగా ఆహ్వానం పలికామని రాష్ట్ర క్రీడాశాఖామంత్రి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఇవాళ ఆమె ముఖ్యమంత్రి శ్రీవైఎస్‌ జగన్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారని, పివి సింధు సాధించిన విజయం పట్ల సీఎం చాలా సంతోషం వ్యక్తంచేశారని తెలిపారు. అలాగే భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని సిఎం మనస్పూర్తిగా ఆకాంక్షించారన్నారు. రాబోయో ఒలంపిక్స్‌ లో పివి సింధు గోల్డ్‌ మెడల్‌ సాధించాలని సిఎంగారు కోరుకున్నారని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆడపిల్లలకు ఒక బ్యాడ్మింటన్‌ అకాడమీ వుంటే బాగుంటుందని పివి సింధు కోరిన మీదట విశాఖపట్నంలో 5 ఎకరాలను కేటాయిస్తామని సిఎం శ్రీవైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం అండగా వుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. మన తెలుగు అమ్మాయి అయిన సింధూకు అన్నిరకాల ప్రోత్సాహం ఇవ్వాలని సిఎం ఆదేశించినట్లు తెలిపారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image