గ‌వ‌ర్నర్, ముఖ్యమంత్రితో రేపు మర్యాదపూర్వకంగా భేటీకానున్న తెలుగుతేజం పీవీ సింధు

గ‌వ‌ర్నర్, ముఖ్యమంత్రితో రేపు మర్యాదపూర్వకంగా భేటీకానున్న తెలుగుతేజం పీవీ సింధు
అమరావతి: బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌ పీవీ సింధు ఈరోజు(12-09-2019) రాత్రి 8 గంటల 40 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రేపు (13-09-2019) గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వెలగపూడి సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను విజయవాడలోని  రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలవనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పీవీ సింధును ఘనంగా సత్కరించడం జరుగుతుంది.