విజయవాడలో మరో ప్రెస్ క్లబ్ కి శ్రీకారం చుట్టబోతున్న ఏపీ ఎస్ ఎస్

*విజయవాడలో మరో ప్రెస్ క్లబ్ కి శ్రీకారం చుట్ట బోతున్న ఏపీ ఎస్ ఎస్


 *విజయవాడ* 


ఏపీ ఎస్ ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది..


 ఈ కార్యక్రమంలో పలువురు ఎడిటర్లు పాల్గొన్నారు ..


ఏపీ ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసాద్ బాబు మాట్లాడుతూ I&PR లో జరిగిన అవినీతి కుంభకోణంపై 2004 నుంచి 2019 ఆగస్టు 31 వరకు ఏ పత్రికలకి ఎంత ఎంత యాడ్స్ ఏ ప్రాతిపదికన ఇచ్చారు తెలిపే విధంగా ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని కమిషనర్ కి ఇవ్వాలని ప్రతిపాదించారు ...అదే విధంగా విజయవాడలో ఉన్న ఒక ప్రెస్ క్లబ్ కి సభ్యులందరూ హాజరు అవడం లేదని అందుకే మన స్థాయిలో మరో  *రాజధాని ప్రెస్ క్లబ్* గా ఏర్పాటు చేద్దామని సమావేశం తీర్మానించింది..


 అదే విధంగా జిల్లాలో మిగిలిపోయిన సభ్యత్వాలను వెంటనే విజయవాడ చేరే విధంగా అప్లికేషన్లు తీసుకురావాలని ఎడిటర్ లను కోరడమైనది ...


రాబోయే మార్చి వరకి కొత్త అక్రిడేషన్ లేనట్లు సమాచారం కాబట్టి ఎడిటర్లు అందరూ మంచి నడవడిక కలిగిన విలేకరులను తమ పత్రికలను చేర్చుకోవాలని కమిటీ అభిప్రాయపడింది ...


ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే ప్రసాద్ బాబు ,నందిగామ కోటేశ్వరరావు ,కోశాధికారి వి. రవిశేఖర్, సభ్యులు చిమటా శ్రీనివాసరావు ,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు....