పెయిడ్ ఆర్టీస్ట్ లతో డ్రామాలు ఆడుతున్నారు :వై.సి.పి నేతలు

వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
గుంటూరు.
సెప్టెంబర్ 11.


*శ్రీ కాసు మహేష్ రెడ్డి, గురజాల ఎమ్మెల్యే కామెంట్స్* 


గుంటూరు జిల్లా నడిబొడ్డులో చంద్రబాబు పెయిడ్ ఆర్టీస్ట్ లతో డ్రామాలు ఆడుతున్నారు


సిఎంగా వుండి చంద్రబాబు పల్నాడును ఏమాత్రం అభివృద్ధి చేయలేదు


పల్నాడు గురించి చంద్రబాబు కు ఏం తెలుసు?


వైఎస్ఆర్, కాసు బ్రహ్నానందరెడ్డి హయాంలో పల్నాడు అభివృద్ధి జరిగింది


వైఎస్ జగన్ సిఎం అయిన మూడు నెలలో పల్నాడులో మెడికల్ కాలేజ్ మంజూరు చేశారు


ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పి, అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేక పోతున్నారు


చివరికి అసెంబ్లీ ఫర్నీచర్ కూడా తీసుకు వెళ్ళిన చరిత్ర తెలుగుదేశంది


పల్మాడుపై బహిరంగ చర్చకు రండి


వైఎస్ఆర్ సిపి నేతలు అందరం ఆత్మకూరు కు బయలుదేరతాం


తెలుగుదేశం బాదితులతో ఆందోళన చేపడతాం


పల్నాడులో నేడు రైతులు పంటలు పండిస్తున్నారు


రెండో పంటకు కూడా నీరివ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది


ఇచ్చిన వాగ్ధానాల్లో మొదటి సంవత్సరంలోనే అన్ని అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్


ఓర్వలేక చంద్రబాబు రాజకీయాలకు పాల్పడుతున్నారు


ఆత్మకూరు పోతాం.. నిజాలు బయట పెడతాం
-------
*శ్రీ నంబూరు శంకరరావు, పెదకూరపాడు ఎమ్మెల్యే కామెంట్స్*


గతంలో పల్నాడులో బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్ళే పరిస్థితి లేకుండా చేశారు


పార్టీలకు అతీతంగా నేడు వైఎస్ జగన్ పాలనలో సంక్షేమం అందరికీ అందిస్తున్నాం


దీనిని తట్టుకోలేక చంద్రబాబు దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు


ఫ్యాక్షన్ గ్రామాల్లో శాంతి నెలకొల్పుతున్నాం



-------------



శ్రీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎంపీ కామెంట్స్*


అరవై నెలల టిడిపి పాలన, మూడు నెలల వైసిపి పాలనను పల్నాడు చూసింది.


నేడు 300 పడకల ఆసుపత్రి, అనుబంధ గా వైద్య కళాశాల మంజూరయ్యింది.


సాగర్ ద్వారా పల్నాడు ప్రాంతానికి సాగు నీరందిస్తున్నాం.


గురవాచారి అనే వ్యక్తి యరపతినేని అక్రమాలను అడ్డుకున్నారు.


పోలీసులతో ఆయనను వేధించారు.


తొట్టిపాలెంలో మైనారిటీలను వేదించారు.


అంబటి రాంబాబుపై దాడి, పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టించింది ఈ టిడిపి ప్రభుత్వం కాదా?


అప్పుడు చంద్రబాబు కు ఈ అక్రమాలు గుర్థుకు రాలేదా?


చంద్రబాబు కు చిత్తశుద్ధి వుంటే పల్నాడు లోని అన్ని గ్రామాలు తిరుగుదాం


చంద్రబాబు కు ఈ మేరకు సవాల్ విసురుతతున్నాం.
--------
శ్రీ ముస్తాఫా, ఎమ్మెల్యే


గతంలో పల్నాడు కు వెడుతున్న మాపై కనీవినీ ఎరగని విధంగా దాడి చేయించారు.


జెడ్పీటిసి ఎన్నిక సందర్భంగా భయోత్పాతం సృష్టించిన చరిత్ర తెలుగుదేశంది.


చంద్రబాబు తన పాలనలో పల్నాడులో అరాచకాకు పాల్పడ్డారు.


వైఎస్ జగన్ పాలన చూసి చంద్రబాబు కళ్ళు తెరవాలి.
-----------
*శ్రీ విడతల రజని, చిలకలూరిపేట ఎమ్మెల్యే*


చంద్రబాబు చలో ఆత్మకూరు కు అర్ధం లేదు.


ప్రతిపక్షంలో వున్నప్పుడు తమను ఎన్నో ఇబ్బందులు పెట్టారు.


ఇప్పుడు తెలుగుదేశం మనుషులతో
పునరావాస కేంద్రాలు పెడతామని చెబుతున్నారు.


చిలకలూరిపేట నియోజకవర్గం మొత్తం మీద 500 మందిపై రౌడీ షీట్లు పెట్టారు


ఎడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట మండలాల్లో భయభ్రాంతులకు గురి చేశారు.


మేమంతా ఆత్మకూరు వస్తాం... చంద్రబాబుకు దమ్ముంటే చర్చకు రావాలి
---------
*శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే*


చంద్రబాబు దిగజారి రాజకీయాలు చేస్తున్నారు.


వైఎస్ జగన్ ఈ రాష్ట్రంలో పేదలకు, రైతులకు అండగా పాలన సాగిస్తున్నారు.


పల్నాడులో ఎక్కడా అశాంతి లేదు. 


చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు అసత్యం.


దమ్ముంటే నిరూపణకు చంద్రబాబు ముందుకు రావాలి


మీ ఆరోపణలు నిజమని నిరూపిస్తే 
నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను


చంద్రబాబు నువ్వు చెప్పింది తప్పు అని తేలితే ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి.


పల్నాడు ను రాజకీయ స్వార్ధం కోసం వాడుకుంటున్నావు.


పల్నాడులో ఏడుగురిని దారుణంగా నరికి చంపించిన చరిత్ర తెలుగుదేశం ది.


ఆత్మకూరు గ్రామంపై దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు.


లేని అశాంతిని కల్పించవద్దు.


ప్రశాంతంగా వున్న పల్నాడును మళ్ళీ రగిలించాలని చూడవద్దు.


పల్నాడు ప్రజల మనోభావాలను దెబ్బతీయవద్దు.


ఎవరో జ్యోతీషుడు చెప్పిన మాటలు విని చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడు.
----------


*శ్రీ అంబటి రాంబాబు, సత్తెనపల్లి ఎమ్మెల్యే*


పల్నాడులో సుబ్బారావు అనే రైతుకు చెంది‌న 18 ఎకరాల భూమిని‌ కోడెల శివప్రసాదరావు, ఆయన అనుచరులు ఆక్రమించారు


ఇదే సుబ్బారావు అప్పుడు తెలుగుదేశం కార్యకర్త


కోడెల విజయానికి కూడా పని చేశారు


అయినా కూడా ఆయన భూమిని వదిలిపెట్టలేదు.


పోలీసులతో బెదరించారు.


సుబ్బారావు కు చెందిన కోళ్ళఫారం నుంచి కోళ్ళను, పొటేళ్ళను కూడా బలవంతంగా లాక్కువెళ్ళిన ఘనత టిడిపి నాయకులది


ఈ అరాచకంకు భయపడి సుబ్బారావు తన ఊరు వదిలిపెట్టాల్సి వచ్చింది.


ఇప్పుడు ఇదే సుబ్బారావు ధైర్యంగా తనకు చేసిన అన్యాయం ను బయటపెడుతున్నాడు


చంద్రబాబు దీనిని వినేందుకు సిద్దంగా వున్నాడా?
-----


Popular posts
87-88 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థుల కలయిక
Image
*పేదలకు వరప్రసాదినిలా 108, 104 సేవలు* తిప్పిరెడ్డి.నారపరెడ్డి..... వింజమూరు, జూలై 1 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం లాంచనంగా ప్రారంభించిన 108, 104 అంబులెన్సు వాహనాలు పేద వర్గాల ప్రజలకు వరప్రసాదినిగా మారనున్నాయని మండల వై.సి.పి కన్వీనర్ తిప్పిరెడ్డి.నారపరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలో వై.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 108, 104 సేవలను విస్తరించనున్నామని హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ నేపధ్యంలో దాదాపుగా 201 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి 1088 అంబులెన్సు వాహనాలను విజయవాడలోని బెంజి సర్కిల్ కూడలి వద్ద ప్రారంభించడం అభినందనీయమని నారపరెడ్డి కొనియాడారు. దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నాడు ఆరోగ్యశ్రీతో పాటు 108 వాహనాలను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. కాలక్రమేణా 108 వాహనాల వ్యవస్థ మరుగున పడి వాటి మనగడే ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్ తండ్రి బాటలో పయనిస్తూ ఒకేసారి 1088 అంబులెన్సు వాహనాలను ప్రజలకు సేవ చేసేందుకు ప్రారంభించి అటు తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ ఇటు ఆపదలలో ఉన్నవారికి ఆపద్భాంధవునిలా నిలిచారన్నారు. ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో ఈ అంబులెన్సు వాహనాలు త్వరలోనే ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కేటాయించనున్నారని నారపరెడ్డి తెలియజేశారు. ప్రజల సం క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న యువ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పధకాలతో పాటు అదనంగా కొత్త పధకాలకు శ్రీకారం చుడుతుండటం గొప్ప విషయమన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ప్రజల సం క్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందిస్తున్న సి.యం జగన్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారని తిప్పిరెడ్డి.నారపరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Image
హర్జిత్ సింగ్ పోరాట పటిమ పోలీసు శాఖ కు ఆదర్శం : డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ IPS
Image
చనిపోయాక కూడా ఆవ్యక్తికి మనశ్శాంతి లేకుండా దుష్ప్రచారమా?
గుండెపోటుతో మరణించిన వాలంటీర్ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం: సీఎం  వైయస్.జగన్
Image