*గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఫలితాల విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
రికార్డు సమయంలో ఈ యజ్ఞాన్ని పూర్తిచేశారు, అధికారులందరికీ అభినందనలు: ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్
ఏకకాలంలో ఇంతమందికి ఒకేసారి ఉద్యోగాలు ఇవ్వడం రికార్డు: ముఖ్యమంత్రి
ఎన్నికల హామీలో చెప్పినట్టుగా ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం
ఒకే నోటిషికేషన్ ద్వారా 1,26,728 శాశ్వత ఉద్యోగాలను కల్పించడం చరిత్రలో తొలిసారి: ముఖ్యమంత్రి
పరీక్షల్లో విజయం సాధించిన వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా: ముఖ్యమంత్రి
వీరికి మంచి శిక్షణ ఇస్తాం, వీరంతా ప్రజా సేవలో మమేకం కావాలి: ముఖ్యమంత్రి
అవినీతికి దూరంగా, నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించిన అధికారులకు అభినందనలు: ముఖ్యమంత్రి
అంకితభావంతో పరీక్షలు నిర్వహించడంలో మంచి పనితీరు కనపరిచారు: ముఖ్యమంత్రి
అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయి: ముఖ్యమంత్రి
పరిపాలనలో విప్లవాత్మక మార్పులు సచివాలయాలు ద్వారా వస్తాయి: ముఖ్యమంత్రి
వర్గాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిటకే సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అందుతాయి: ముఖ్యమంత్రి