టీడీపీ జెండా పట్టిన వారికి అండగా లోకేశ్    

టీడీపీ జెండా పట్టిన వారికి అండగా లోకేశ్                                                                                                                                          -తెలుగుదేశం కార్యకర్తలకు ఆర్ధిక సాయం 
-కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి మంజూరు                                                                                                                                       -సహాయం చెక్కులు అందజేసిన టీడీపీ నేతలు 


   మంగళగిరి :    సమాజమే దేవాలయం ..ప్రజలే దేవుళ్ళు నినాదంతో ప్రారంభమై అదే విధానాన్ని కొనసాగిస్తోంది తెలుగు దేశం పార్టీ. టీడీపీ జెండా పట్టిన కార్యకర్తలకు  అండగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలిచారు. మంగళగిరి నియోజకవర్గం, మంగళగిరి పట్టణ కార్యకర్తల వైద్య, విద్య అవసరాలకు సాయం అందించి నేనున్నానంటూ అభయం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి నారా లోకేశ్ మంజూరు చేసిన ఆర్ధిక సాయం చెక్కులను సోమవారం మంగళగిరి నియోజకవర్గ కార్యాలయం ఎం ఎస్ ఎస్ భవన్ లో కార్యకర్తలకు అందజేశారు. మంగళగిరి 28వ వార్డ్ అంబేద్కర్ నగర్ కి చెందిన ఎస్ ప్రభాకర రావు కి పదివేలు, 8వ వార్డ్ కి చెందిన వుద్దంటి బేబీ వైద్య ఖర్చుల కోసం పదివేల రూపాయల చెక్కులను అందజేశారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు మునగపాటి మారుతీ రావు అధ్యక్షతన  జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, మాజీ మునిసిపల్ చైర్మన్ గంజి చిరంజీవి,  టీడీపీ సీనియర్ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, నందం అబద్దయ్య, కొమ్మా లవకుమార్, ఎండీ ఇబ్రహీం, ఏఎంసీ మాజీ చైర్ పర్సన్ ఆరుద్ర భూలక్ష్మి, మాజీ కౌన్సిలర్లు, మైనారిటీ నాయకులు ఎండీ ఇక్బాల్ అహ్మద్, జంజనం వెంకట సాంబశివరావు, ప్రేమ్ కుమార్, విలియం, కార్యకర్తలు పాల్గొన్నారు.