ఆంధ్రా బ్యాంకును కాపాడుకుందాం.. విలీనీకరణను అడ్డుకుందాం

ఆంధ్రా బ్యాంకును కాపాడుకుందాం.. విలీనీకరణను అడ్డుకుందాం
* ఈ నెల 28న జ‌రిగే ఛలో విజయవాడను జయప్రదం చేయండి 
* పిలుపునిచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ 
అమ‌రావ‌తి: ఆంధ్రా బ్యాంకును కాపాడుకోవటంతో పాటుగా, బ్యాంకుల విలీనాన్ని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరు కదిలి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈ నెల 28 న చేపట్టిన ఛ‌లో విజయవాడ పేరిట చేపట్టిన నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రా బ్యాంక్ విలీనీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన ర్యాలీకి శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి మద్దతు తెలియచేయాలని కోరారు. అయితే సీపీఐ చేపట్టిన ఈ కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ జీడీపీ వృద్ధి ఆరు శాతం కంటే తక్కువగా ఉన్న రోజున కేంద్రం బ్యాంకుల విలీనం ప్రకటించటం ప్రజలను దారి మళ్లించేందుకేనని విమర్శించారు. దేశంలో ఉన్న బ్యాంకులను 12 బ్యాంకులుగా మార్చేందుకు రోడ్డు మ్యాప్ సిద్ధమైందని చెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ ఏ రోజు విలీనాన్ని అమలోకి తీసుకొస్తామని చెప్పలేదని వ్యాఖ్యానించారు. బ్యాంకుల విలీనం నిర్ణయం సరైనది కాదని, ఇది తప్పుడు నిర్ణయమని, బ్యాంకులను విలీనం చేయటం అంటే బ్యాంకులను హత్య చేయటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1969లో బ్యాంకుల జాతీయకరణ చేయబడ్డాయని అన్నారు. బ్యాంకులు ఈ విధంగా మూతపడితే ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తుందని అన్నారు. 96 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్రా బ్యాంక్ ను యూనియన్ బ్యాంకులో విలీనం చేయటం అంటే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కించపరిచటమేనని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య ఉద్యమ నేత శ్రీ బోగరాజు పట్టాభి సీతారామయ్య స్థాపించిన బ్యాంకు అన్నదాతలకు అండగా నిలిచిన బ్యాంకు ఆంధ్రా బ్యాంక్ అని కొనియాడారు. 1923 నవంబర్ 20న ఆంధ్రాబ్యాంకు ను లక్ష రూపాయల మూల ధనంతో ప్రారంభించారని చెప్పారు. అప్పటి వరకు బ్యాంకులంటే ధనవంతులకే అణా అపోహను ఆంధ్రాబ్యాంకు స్థాపనతో పటాపంచలు చేశారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం సేవలు అందించి, రెండువేల శాఖలగా ఆంధ్రా బ్యాంకు విస్తరించి ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకునేందుకు బ్యాంకుల విలీనాన్ని పక్కన పెట్టి ఆంధ్రాబ్యాంకును మాత్రమే విలినీకరణ చేసే ఆలోచన చేయటం తగదన్నారు.ఆంధ్రా బ్యాంకు ను పరిరక్షించుకోవటానికి ప్రజలతో, కార్మికులతో, కర్షకులతో, ఉద్యోగులతో, మేధావులతో, ఇతర ప్రజా సంఘాలతో ఐక్యంగా ముందుకు సాగి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 28న సీపీఐ ఛలో విజయవాడ పేరిట నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నెల కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు,  రాజకీయలకి అతీతంగా తరలిరావాలని కోరారు. ప్రజా సంక్షేమం కోసం తమ ఉద్యమాలు కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శితో పాటు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హరినాధ్ రెడ్డి పాల్గొన్నారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image