తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి

*అమరావతి*


తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని బుధవారం నాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 


ఇప్పటి వరకూ పాలకమండలిలో 16 మంది సభ్యులు ఉండగా.. ఈ సంఖ్యను ప్రభుత్వం ఇటీవల 25మందికి పెంచింది. 


వీరితో పాటు దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ ఈవో, దేవదాయ శాఖ కమిషనర్‌, తుడా చైర్మన్‌.. ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఉంటారు. 


కాగా.. 28 మందిలో 


ఆంధ్రప్రదేశ్ నుంచీ 8 మందికీ, 


తెలంగాణ నుంచీ ఏడుగురికీ 


తమిళనాడు నుంచీ 4గురు, 


కర్ణాటక నుంచీ ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు. 


ఢిల్లీ, మహారాష్ట్ర నుంచీ ఒక్కొక్కరికి సభ్యత్వం కల్పించారు. 


టీటీడీ పాలకమండలిలో పలువురు ఎమ్మెల్యేలకు కూడా స్థానం కల్పించారు. 


మహిళా కోటాలో కూడా కొందరికి అవకాశం కల్పించడం విశేషం. 


*టీటీడీ పాలకమండలి జాబితా...*


1. యు.వి. రమణమూర్తి రాజు (ఎమ్మెల్యే)
2. మేడా మల్లిఖార్జునరెడ్డి (ఎమ్మెల్యే)
3. కొలుసు పార్ధసారధి (ఎమ్మెల్యే)
4. పరిగెల మురళీకృష్ణ
5. కృష్ణమూర్తి వైద్యనాథన్
6. నారాయణస్వామి శ్రీనివాసన్
7. జూపల్లి రామేశ్వరావు
8. వి.ప్రశాంతి
9. బి.పార్ధసారధిరెడ్డి
10. డాక్టర్ నిశ్చిత ముత్తవరపు
11. నాదెండ్ల సుబ్బారావు
12. డీపీ అనంత
13. రాజేశ్ శర్మ
14. రమేష్ శెట్టి
15. గుండవరపు వెంకట భాస్కరరావు
16. మూరంశెట్టీ రాములు
17. డి.దామోదరావు
18. చిప్పగిరి ప్రసాద్ కుమార్
19. ఎం.ఎస్.శివశంకరన్
20. సంపత్ రవి నారాయణ
21. సుధా నారాయణమూర్తి
22. కుమారగురు (ఎమ్మెల్యే)
23. పుట్టా ప్రతాప్ రెడ్డి
24. కె.శివకుమార్
25. స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఎండోమెంట్స్
26. దేవాదాయశాఖ కమిషనర్
27. తుడా ఛైర్మన్
28. టీటీడీ ఈవో


ఇదిలా ఉంటే.. పాలకమండలిలో సభ్యులుగా అవకాశం వస్తుందని ఆశించిన వారికి రాకపోగా.. ఊహించని వ్యక్తులకు చోటు దక్కడం గమనార్హం. 


దీంతో జాబితా చూసిన ఆశావహులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారని తెలుస్తోంది


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
అల్లుకుపోతున్న ట్రాన్స్ కో నిర్లక్ష్యం...
Image
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 
Image
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు