13జిల్లాలలో వైసిపి ప్రభుత్వ బాధితులతో చంద్రబాబు భేటి. 

13జిల్లాలలో వైసిపి ప్రభుత్వ బాధితులతో చంద్రబాబు భేటి. 
తమపై దాడులను, దౌర్జన్యాలను ఏకరువు పెట్టిన బాధితులు
ఆదిమూర్తి, ఆవులప్ప: ''18ఎకరాల్లో 5,400 దానిమ్మ చెట్లను నరికేశారు. వైసిపి వచ్చింది కాబట్టి ఆ భూములు లాక్కుంటామని బెదిరిస్తున్నారు. 
భూములు నాశనం చేస్తే పార్టీలోకి వస్తారని దౌర్జన్యాలకు పాల్పడ్డారు. పార్టీ మారితే మా భూములు మాకుంటాయట, లేకపోతే ధ్వంసం చేస్తారట..50ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములు లాక్కుంటున్నారు'' అని వాపోయారు.
కిలారి మారుతి, దారపనేని మంగమ్మ( మైల సముద్రం, కొత్తచెరువు మండలం, పుట్టపర్తి నియోజకవర్గం): ''మూగవాడని కూడా దయలేకుండా తల పగులకొట్టారు. 14కుట్లు పడ్డాయి. అడ్డంపడితే ముసల్దానిని  అనికూడా చూడకుండా దారుణంగా కొట్టారు. ఇన్నాళ్లు పోలీసులు పట్టించుకోలేదు, ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నామని తెలిసి స్టేషన్ కు రమ్మని ఫోన్లు చేస్తున్నారు అధికారులు'' అంటూ కన్నీరు పెట్టుకున్నారు.
చెల్లబోయిన విజయలక్ష్మి, నాగమల్లేశ్వరి(విశ్వేశ్వరయ్యపురం, తూర్పుగోదావరి జిల్లా): ''25ఏళ్లుగా మా స్వాధీనంలో ఉన్న భూమిని లాక్కున్నారు. కాపు కార్పోరేషన్ ఛైర్మన్ పదవి అడ్డం పెట్టుకుని జక్కంపూడి రాజా బెదిరిస్తున్నారు. 1994లో కొనుక్కున్న ఎకరం 70సెంట్ల  భూమిని కబ్జా చేశారు. 
ఈనెల 6న తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో మీకు ఫిర్యాదు చేశామనే అక్కసుతో ఆ స్థలంలోని కొబ్బరి చెట్లను నరికేశారు. మగాళ్లను అక్రమకేసులలో ఇరికించి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి జైలకు పంపారు. మహిళలను రోడ్డుకీడ్చారు. పేదల ఉసురు పోసుకుంటున్నారు'' అని కన్నీరు పెట్టుకున్నారు.


చంద్రబాబు: శరీరంపై గాయాలు చేస్తే కొన్నాళ్లకు మానుబడతాయి. అదే ఆర్ధిక మూలాలను దెబ్బతీస్తే కోలుకోవాలంటే కొన్ని తరాలు పడతుంది. 
వీళ్లా పెయిడ్ ఆర్టిస్టులు..? ఈ బాధితులా అద్దె మనుషులు..? లేక మీరా అద్దె మైకులు..? 
బాధితులను పట్టుకుని ఈవిధంగా అనేందుకు నోరెలా వచ్చింది..? 
చాలా దుర్మార్గమైన కార్యక్రమం. వైసిపి దుర్మార్గాలను సహించే ప్రసక్తేలేదు. బాదిత కుటుంబాలకు అండగా ఉంటాం.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image