బిడ్డలను దారుణంగా కొట్టారు - భర్తలను జైళ్లకు పంపారు.

 బిడ్డలను దారుణంగా కొట్టారు. భర్తలను జైళ్లకు పంపారు.
చంద్రబాబును చుట్టుముట్టి కన్నీరు మున్నీరైన ఉంగుటూరు మహిళలు
గుంటూరు.    ':.      టిడిపి కార్యాలయానికి తరలివచ్చి చంద్రబాబుకు  ఫిర్యాదు
అమరావతి మండలం ఉంగుటూరుకు చెందిన మహిళలు, బాధితులు శుక్రవారం గుంటూరు పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. 
తమ తలలు పగుల కొట్టారని యువకులు, తమ భర్తలను అన్యాయంగా జైళ్లకు పంపాలని మహిళలు వాపోయారు. తనను చుట్టుముట్టి కన్నీరు మున్నీరు కావడంతో చంద్రబాబు చలించిపోయారు. 
 ''మా ఊళ్లో టిడిపికి 500పైగా మెజారిటి వచ్చిందని వైసిపి నేతలు కక్షకట్టారు. చివరికి వినాయకుడి బొమ్మ ఊరేగింపును కూడా సహించలేక పోయారు. దేవుడి పాటలు పెట్టినా అడ్డుకున్నారు.వందమంది ఆడాళ్లం రోడ్డుపై కూర్చుంటే రాళ్లు, నాటు కర్రలు, కొబ్బరిబోండాలతో, సీసాలతో దాడిచేశారు. మా బిడ్డలను దారుణంగా కొట్టారు. మా భర్తలను జైళ్లకు పంపారు. గ్రామం వదిలేసి గుంటూరులో ఉంటున్న వాళ్లపై కూడా తప్పుడు కేసులు పెట్టారు. వాళ్లువాళ్లు కొట్టుకుని మాపై కేసులు పెడుతున్నారు.మా రాజ్యం వచ్చింది కాబట్టి అంతా మాఇష్టం, మా ఇష్టం వచ్చినట్లు కేసులు పెడతాం అని బాహాటంగా బెదిరిస్తున్నారు. వీళ్ల అరాచకాలతో ఊళ్లలో ఉండలేకపోతున్నాం అయ్యా'' అని మహిళలు,వృద్దులంతా చంద్రబాబును చుట్టుముట్టి బావురుమన్నారు. తన తల పగులగొట్టిన వారిపై ఎటువంటి కేసులు పెట్టలేదని తీవ్రంగా గాయాలపాలైన పంగులూరి రాజేష్ వాపోయాడు.
వాళ్ల కన్నీళ్లు చూసి చలించిపోయిన చంద్రబాబు '' దుర్మార్గులంతా అధికారంలోకి వచ్చారు. ప్రశాంతంగా జరిగే పండుగలను కూడా దాడులకు వేదికలుగా మార్చారు. వినాయకుని నిమజ్జనం, మొహర్రం పండుగ రోజుల్లో కూడా దాడులకు తెగపడటం కిరాతకం. వైసిపి నేతలు కావాలనే ఇదంతా చేస్తున్నారు. కక్షకట్టి టిడిపి కార్యకర్తలను కేసులలో ఇరికిస్తున్నారు. రైతులు, బీసిలు,ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాల ఆర్ధిక మూలాలు దెబ్బతీస్తున్నారు, పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. అందరూ ధైర్యంగా ఉండాలి. మనోధైర్యంతో పోరాడాలి. దుర్మార్గులకు లొంగిపోతే సమాజంలో మంచే ఉండదు. అన్నివర్గాల బాధితులంతా సంఘటితంగా పోరాడాలని'' వారిలో ధైర్యం నింపారు, పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
వైసిపి ప్రభుత్వ అరాచకాలకు నిరసనగా 'ఛలో ఆత్మకూరు' ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తినా దాడులు, దౌర్జన్యాలు ఆగకపోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. 
 చంద్రబాబును కలిసినవారిలో ఉంగుటూరు గ్రామ మహిళలు కల్లూరి రమాదేవి, వేదగిరి రాజ్యలక్ష్మి,బాలినేని సునీత, నల్లూరి కమల,నూకవరపు శ్రీలక్ష్మి,జెట్టి రాధిక,నల్లూరి సుధారాణి, సీతారావమ్మ, చిన్నం రంగమ్మ ,కృష్ణకుమారి,పద్మజ,సామ్రాజ్యం తదితర మహిళలు ఉన్నారు.