రొట్టెలపండుగ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

🔹.   నెల్లూరు :     బారాషాహీద్ దర్గా వద్ద రొట్టెలపండుగ ఏర్పాట్లను పరిశీలించిన గౌ|| నీటిపారుదలశాఖా మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.


🔹 గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లకు తావులేకుండా అన్ని శాఖల అధికారులతో సమిష్టిగా పనులు చేస్తూ, రాజకీయాలకు తావులేకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని పనులు పూర్తి చేశాం. మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్,


🔹 స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.  మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్. 


🔹 బారాషాహీద్ దర్గా ప్రాంగణంలో రాజకీయ ఫ్లెక్సీ కట్టిఉంటే స్వయంగా రాజకీయ ఫ్లెక్సీని తొలగించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 
 
🔹 రొట్టెలపండుగ పూర్తిఅయ్యేవరకు బారాషాహీద్ దర్గాలోనే భక్తులకు అందుబాటులో ఉంటా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.