తేది.13-09-2019
*నెల్లూరు జిల్లా, రొట్టెల పండుగ సందర్బంగా నెల్లూరు పర్యటనలో భాగంగా కసుమూరు దర్గాకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీ శాఖ మంత్రివర్యులు అంజాద్ బాషాను ఘన స్వాగతం పలికిన మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి , వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి
*ప్రత్యేక పూజలు నిర్వహించి, దర్గా ప్రాంత ప్రాముఖ్యతను తెలియజేసిన ఎమ్మెల్యే కాకాణి.*
*దర్గా అభివృద్ధికి నిధులు కేటాయించాల్సిందిగా మైనారిటీ శాఖ మంత్రిని కోరిన ఎమ్మెల్యే కాకాణి.*
*ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ...*
👉ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి కి ఎల్లవేళలా భగవంతుని ఆశీస్సులు ఉండాలని , అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించా.
👉వక్ఫ్ బోర్డ్ ఆస్తులు కాపాడి, అభివృద్ధి చేస్తాము.
👉గోవర్ధన్ అన్న కోరిక మేరకు నేను ఇక్కడికి రావడం నాకు సంతోషంగా ఉంది.
*ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.....*
👉ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి కి అనింటిలో విజయం చేకూర్చాలని ప్రార్థించా.
👉అన్ని వర్గాల వారు కసుమూరుకు వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు.
👉ఈ దర్గా పవిత్రత ఎంతో గొప్పది.
*కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ...*
👉కసుమూరు దర్గాలో ఇతర దేశాల నుంచి భక్తులు వచ్చి ప్రార్ధించడం జరుగుతుంది.
👉ఇక్కడకు హిందు, ముస్లిం అనే తేడా లేకుండా భక్తి శ్రద్ధలతో వస్తుంటారు.
👉2004 లో ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఈ దర్గా అభివృద్ధి పై దృష్టి పెట్టారు.
👉అనంతరం వచ్చిన వారు పట్టించుకోలేదు.
👉తాను ఎమ్మెల్యే గా వచ్చిన తరువాత గతంలో అధికారం లేదు.
👉ముస్లిం మైనారిటీలకు వై.యస్. కుటుంబం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
👉ముఖ్యమంత్రి గా వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు.
👉ఆనం రామనారాయణ రెడ్డి సూచనలు, సలహాలు తీసుకొంటాము.
👉ఒక ప్రణాళిక తయారు చేసి అభివృద్ధి చేస్తాము.
👉మనం ఉన్న సమయంలో దర్గాను అభివృద్ధి చేస్తే మనకు కీర్తి ప్రతిష్టాలతో పాటు బాబా ఆశీర్వాదం ఉంటాయి.
👉దర్గాను మంచి పుణ్యక్షేత్రం గా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాను.