ఇరిగేషన్‌ శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష

అమరావతి


*ఇరిగేషన్‌ శాఖపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*


*వరద వచ్చినప్పుడే ఒడిసిపట్టాలి: ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌*
*30 రోజుల్లో కృష్ణా వరదజలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులు నిండాలి*
*సముద్రంలోకి నీళ్లు వెళ్లకముందే శరవేగంగా కృష్ణావరదజలాల పై ఆధారపడ్డ ప్రాజెక్టులు నిండాలి*
*ఆమేరకు ప్రణాళికలు సిద్ధం చేయండి*
*120 రోజుల వరద వస్తుందనే లెక్కలను సవరించండి:*
*ఇరిగేషన్‌ శాఖసమీక్షలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌*
*ఈ సీజన్‌లో వరద వచ్చినా... ప్రాజెక్టులను నింపడానికి చాలా సమయం పడుతోంది*
*అతితక్కువ సమయంలో భారీగా వరద వచ్చింది*
*శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నిండి వరదజలాలు సముద్రంలోకి వెళ్లాయి*
*దేవుడు దయవల్ల రెండోసారి వరద వచ్చింది*
*30 రోజులు మాత్రమే వరద వస్తుందని అంచనా వేసి ఆమేరకు ఆ నీటిని తరలించడానికి ఏంచేయాలో అది చేయండి*
*లేకపోతే కృష్ణా వరదజలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులు చిహ్నాలుగా మిగలిపోతాయి*
*ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నాకూడా సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నాం*
*ప్రతిరూపాయినికూడా సద్వినియోగం చేయాలి*
*సాగునీటి ప్రాజెక్టుల్లో స్కాంలు లేకుండా చూసుకోవాలి*
*ప్రస్తుతం ఏ వర్కు చూసుకున్నా స్కామే కనిపిస్తోంది*
*సాగునీటి ప్రాజెక్టు పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌ విధానం పాటించాలని సీఎం ఆదేశం*
*నాలుగేళ్లలో తప్పనిసరిగా ఇప్పుడున్న ప్రాజెక్టులు పూర్తికావాలన్న సీఎం*
*దీనికోసం జిల్లాల వారీగా ప్రణాళికలు సిద్ధంచేయాలని సీఎం ఆదేశం*
*ఒడిశాతో ఉన్న సమస్యల పరిష్కారానికి ఆరాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలకు సన్నాహం చేయాలన్న సీఎం
*పల్నాడును సస్యశ్యామలం చేయాలి, దీనికోసం పనులు వేగంగా మొదలుపెట్టాలన్న  సీఎం*


అమరావతి: ఇరిగేషన్‌పై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రాజెక్టుల వారీగా, జిల్లాల వారీగా సమీక్ష
ఇప్పటివరకూ జరిగిన పనులు, పెండింగ్‌లో ఉన్న పనులపై అధికారులనుంచి  అడిగితెలుసుకున్న సీఎం


ఈ ఏడాది కృష్ణా వరదజలాలు బాగా వచ్చాయి: సీఎం
ఈ స్థాయిలో నీళ్లు వచ్చినా రాయలసీమ ప్రాజెక్టులు నింపడానికి చాలా సమయం  పడుతోంది: సీఎం
లోపాలు ఎక్కడున్నాయన్నది గుర్తించాలి: సీఎం
నీళ్లు వచ్చినప్పుడే వాటిని ఆదాచేసుకునే పరిస్థితి ఉండాలి:
తక్కువ రోజుల్లో వరద ఉన్నప్పుడు కూడా నింపే పరిస్థితి ఉండాలి:
ఎక్కడెక్కడ ఇబ్బందులు వచ్చాయో వాటిని గుర్తించండి:
వరదజలాలు 30–40 రోజలకు మించి ఉండవన్నది అంచనాతో ప్రణాళిక సిద్దంచేయండి: సీఎం
ఈ తక్కువ సమయంలోనే ప్రాజెక్టులు నింపాలి: సీఎం
రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు ఎందుకు వేగంగా పోవడంలేదో, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించండి: 
దేవుడి ఆశీర్వాదం వల్ల ఇప్పుడు రెండోసారి నీళ్లు వచ్చాయి:
ప్రతి ఏడాది ఇలా జరుగుతుందని అనుకోలేం:
ప్రస్తుతం ఉన్న రాయలసీమ ప్రాజెక్టులు 120 రోజులపాటు వరదజలాలను మళ్లించడానికి ఉద్దేశించినవన్న అధికారులు
30 రోజుల్లో వాటిని నింపే పరిస్థితి రావాలన్న సీఎం
రాయలసీమ ప్రాజెక్టులు సహా వెలగొండ ప్రాజెక్టులు ఆమేరకు సన్నద్ధంకావాలన్న సీఎం
ఆమేరకు ఏం చేయాలో.. ప్రణాళిక సిద్ధంచేయాలన్న సీఎం
సాగునీటి ప్రాజెక్టుల్లో స్కాంలు లేకుండా చూసుకోవాలన్న సీఎం
ఏ వర్కు చూసుకున్నా స్కామే కనిపిస్తుందన్న సీఎం
ఒక్కరూపాయి కూడా దుర్వినియోగం కాకుండా చూడాలన్న సీఎం


శ్రీశైలంలో 854 అడుగుల వద్ద పోతిరెడ్డిపాడు నుంచి కేవలం 6–8వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలమన్న అధికారులు: సీఎం
ఈసారి వరద కారణంగా జలయజ్ఞం తొలి ఫలితాలను అందుకున్నామన్న అధికారులు: సీఎం
పోతిరెడ్డిపాడు నుంచి తొలిసారిగా 44వేల క్యూసెక్కులకుపైగా వరదజలాలను తరలించామన్న అధికారులు
వెలుగోడు నుంచి కడపకు పోయే కాల్వ లైనింగ్‌ పూర్తికాలేదని, అందువల్ల రాయలసీమ ప్రాజెక్టులకు ఆశించినంత నీటిని తీసుకెళ్లలేకపోయామన్న అధికారులు
వెలిగొండ  ప్రాజెక్టు పనులను అడిగితెలుసుకున్న సీఎం
టన్నెల్‌ –1 ఇంకా 1.56 కిలోమీటర్ల పనిచేయాల్సి ఉంది
టన్నెల్‌ –2 పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి 
హెడ్‌ రెగ్యులేటర్‌ పనులుకూడా వేగవంతం చేయాలన్న సీఎం
వరద వచ్చినప్పుడు వీలైనన్ని జలాలు తరలించే అవకాశం లేకపోతే వాటి ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులు చిహ్నాలుగా మిగిలిపోతాయన్న సీఎం


గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతం సస్యశ్యామలం కావాలి: సీఎం
ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించాలి:సీఎం
వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తిచేయాలి: సీఎం
వరికపూడిశెల ప్రాజెక్టులో అన్ని విడతలూ ఒకేసారి పూర్తిచేయడానికి ప్రయత్నాలు చేయాలన్న సీఎం
ఇప్పటికి వచ్చి ఏప్రభుత్వమూ పల్నాడు ప్రాంతాన్ని పట్టించుకోలేదు:సీఎం
ఆ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది: సీఎం
గుంటూరు ఛానల్‌ పొడిగింపుపైనా సీఎం రివ్యూ
ఈ విషయంలో ముందుకు అడుగు వేయాలన్న సీఎం


పోలవరం ప్రాజెక్టు సహాయ పునరావాస పనులపై సీఎం సమీక్ష
దీనికోసమే ప్రత్యేక అధికారిని నియమించామన్న సీఎం
మొన్నటి వరదల్లో మునిగిన ప్రాంతాల ప్రజలకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం
వచ్చే సీజన్‌నాటికి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాలన్న సీఎం
ముంపు బాధితుల పట్ల ఉదారంగా ఉండాలన్న సీఎం
మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు సూచన


చింతలపూడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌పైనా సీఎం రివ్యూ
భూసేకరణలో సమస్య ఉందని నివేదించిన అధికారులు
600 ఎకరాలకుపైగా భూమిని సేకరించాలన్న అధికారులు
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష


ఒడిశాతో అభ్యంతరాలున్న ప్రాజెక్టులపై నోట్‌ ప్రిపేర్‌ చేయాలన్న సీఎం
ఒడిశా సీఎంతో చర్చలకు సన్నాహకాలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
అన్ని అభ్యంతరాలపై ఒక నోట్‌ ప్రిపేర్‌ చేయాలని అ«ధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం


తోటపల్లి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ను పూర్తిచేయాలని సీఎం ఆదేశం
తారకరామ సాగర్‌ ప్రాజెక్టు పనులు ముందుకుసాగడంలేదన్న అధికారులు
జంఝావతి ప్రాజెక్టుపైనా ఒడిశా అభ్యంతరాలు కారణంగా పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వలేకపోతున్నామన్న అధికారులు
దీనిపై నోట్‌ ప్రిపేర్‌ చేయాలన్న సీఎం


వంశధార ప్రాజెక్టుపైన సీఎం సమీక్ష
ముంపు ప్రాంతాలపై సంయుక్త సర్వేకు ఒడిశా ముందుకురాలేదన్న సీఎం
రక్షణగోడ, ఆర్‌ అండ్‌ ఆర్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందన్న అధికారులు
దీనిపై ఒక నోట్‌ సిద్ధం చేయాలన్న సీఎం
వంశధార కెనాల్‌ లైనింగ్‌ పెండింగులో ఉందన్న అధికారులు
డిస్ట్రిబ్యూటరీ నెట్‌ వర్క్‌ ఏర్పాటు చేయాల్సి ఉందన్న అధికారులు
ఈ సీజన్‌నాటికి పూర్తిచేస్తామన్న అధికారులు
హిరమండలం నుంచి హైలెవల్‌ కెనాల్‌ పనులు చేయాల్సి ఉందన్న అధికారులు
నేరడి బ్యారేజీ  నిర్మాణానికి అన్ని ప్రయత్నాలూ చేద్దామన్న సీఎం
ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? అన్నదానిపై పరిశీలన చేయాలన్న సీఎం
మహేంద్ర తనయ చాలా ముఖ్యమైన ప్రాజెక్టు: సీఎం
ఉద్దానం ప్రాంతంలో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు అత్యంత కీలకం: సీఎం
మహేంద్రతనయను కూడా అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టుగా పెట్టుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం


జిల్లాల వారీగా ప్రాజెక్టులపై నివేదికలు సిద్ధంచేయండి: సీఎం
ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టడానికి ప్రణాళిక వేయండి: సీఎం
నాలుగేళ్లలో వాటిని పూర్తి చేయడంపై దృష్టిపెట్టండి: సీఎం
సహాయపునరావాస పనుల్లో ఉదారంగా ఉండండి: సీఎం
ముంపు ప్రాంతాల బాధితుల పట్ల మానవతా దృక్పథంలో వ్యవహరించండి: అధికారులకు సీఎం ఆదేశం


జిల్లాల మధ్య నీళ్లకోసం కొట్లాటలు ఉండకూడదన్న సీఎం
ఆప్యాయతలు పంచుకునే వాతావరణం ఉండాలన్న సీఎం
ఎక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి.. ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధంచేయాలన్న సీఎం
మూడు నాలుగేళ్లలో ప్రాధాన్యతా ప్రాజెక్టులన్నీ పూర్తికావాలని సీఎం ఆదేశం


ఆక్వా కారణంగా మంచినీటి కాల్వలు కలుషితం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది: సీఎం
ఎక్కడ మురుగునీటిశుద్ధి ప్లాంట్లు కావాలో అక్కడ ఏర్పాటు చేయాల్సి అవసరం ఉంది: సీఎం
ఈ కలుషిత నీటినే తాగి.. ప్రజలు తీవ్ర రోగాల బారిన పడుతున్నారు: సీఎం
ఇంతకుముందు అరుదుగా కనిపించే క్యాన్సర్‌ వ్యాధి ఇప్పుడు పరిపాటిగామారింది: సీఎం
ప్రతీదీ కలుషితం అవుతోంది: సీఎం


Popular posts
87-88 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థుల కలయిక
Image
*పేదలకు వరప్రసాదినిలా 108, 104 సేవలు* తిప్పిరెడ్డి.నారపరెడ్డి..... వింజమూరు, జూలై 1 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం లాంచనంగా ప్రారంభించిన 108, 104 అంబులెన్సు వాహనాలు పేద వర్గాల ప్రజలకు వరప్రసాదినిగా మారనున్నాయని మండల వై.సి.పి కన్వీనర్ తిప్పిరెడ్డి.నారపరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలో వై.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 108, 104 సేవలను విస్తరించనున్నామని హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ నేపధ్యంలో దాదాపుగా 201 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి 1088 అంబులెన్సు వాహనాలను విజయవాడలోని బెంజి సర్కిల్ కూడలి వద్ద ప్రారంభించడం అభినందనీయమని నారపరెడ్డి కొనియాడారు. దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నాడు ఆరోగ్యశ్రీతో పాటు 108 వాహనాలను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. కాలక్రమేణా 108 వాహనాల వ్యవస్థ మరుగున పడి వాటి మనగడే ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్ తండ్రి బాటలో పయనిస్తూ ఒకేసారి 1088 అంబులెన్సు వాహనాలను ప్రజలకు సేవ చేసేందుకు ప్రారంభించి అటు తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ ఇటు ఆపదలలో ఉన్నవారికి ఆపద్భాంధవునిలా నిలిచారన్నారు. ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో ఈ అంబులెన్సు వాహనాలు త్వరలోనే ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కేటాయించనున్నారని నారపరెడ్డి తెలియజేశారు. ప్రజల సం క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న యువ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పధకాలతో పాటు అదనంగా కొత్త పధకాలకు శ్రీకారం చుడుతుండటం గొప్ప విషయమన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ప్రజల సం క్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందిస్తున్న సి.యం జగన్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారని తిప్పిరెడ్డి.నారపరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Image
హర్జిత్ సింగ్ పోరాట పటిమ పోలీసు శాఖ కు ఆదర్శం : డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ IPS
Image
చనిపోయాక కూడా ఆవ్యక్తికి మనశ్శాంతి లేకుండా దుష్ప్రచారమా?
గుండెపోటుతో మరణించిన వాలంటీర్ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం: సీఎం  వైయస్.జగన్
Image