రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతి 3 నెలలకోసారి రహదారి భద్రత కౌన్సిల్ స‌మావేశాలు 

రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతి 3 నెలలకోసారి రహదారి భద్రత కౌన్సిల్ స‌మావేశాలు 
* రాష్ట్రస్థాయి తొలి సమావేశంలో మంత్రి పేర్ని వెంక‌ట్రామ‌య్య (నాని) వెల్ల‌డి
అమరావతి: రాష్ట్ర ప్రజల ప్రాణరక్షణకై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రస్థాయి రహదారి భద్రత తొలి కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అన్నారు. గురువారం ఉదయం వెలగపూడి సచివాలయంలోని ఐదవ బ్లాకులోని సమావేశ మందిరంలో రహదారి భద్రత తొలి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమావేశంలో 12 అంశాలపై వివిధ శాఖాధిపతులు, లారీ ఓనర్ల అసోసియేషన్లు తదితరులతో కూలంకషంగా చర్చించడం జరిగిందన్నారు. ప్రజాహితం కోసం మానవతా దృక్పథంతో తమ అమూల్యమైన సందేశాలను అందించిన అధికారులు, అసోసియేషన్ అధిపతులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కౌన్సిల్ సమావేశాలు రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో ప్రతి 3 నెలలకోసారి నిర్వహంచే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, రవాణా శాఖ కమిషనర్ సీతారామాంజనేయులు, వివిధ శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.