కాళేశ్వరం ప్రాజెక్టు తప్పులతడక: కరీంనగర్ ఎం.పి

కాళేశ్వరం ప్రాజెక్టు తప్పులతడక
కరీంనగర్  ఎంపీ బండి సంజయ్ ఆరోపణ.‌‌.‌‌........
వరంగల్.       సెప్టెంబర్14 :
 ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్పగా  చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పై తప్పుల తడక అని బిజెపి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టు వచ్చిన  271 కోట్ల విద్యుత్ బిల్లును ముందుగా చెల్లించిన తర్వాత  మాట్లాడితే బాగుంటుందని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.  ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని  బిజెపి శుక్రవారం నుండి 20వ తేదీ వరకు మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని చేపట్టిన  సేవా సప్తాహం లోసప్తాహం లో భాగంగా శుక్రవారం  సాయంత్రం వరంగల్  నగరంలోని చందా కాంతయ్య మెమోరియల్ హాస్పిటల్ సందర్శించి.    ఆసుపత్రిలో ఎంపీ సంజయ్  రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హాస్పటల్  ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు తప్పులతడక గా ఉన్నదని  ఆరోపించారు కాలేశ్వరం  ప్రాజెక్టు మంచిగా ఉంటేనే మంచిది మేము స్వాగతిస్తామని లేకుంటే వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు‌. కాలేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పుడు వచ్చిన 271 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని అన్నారు. టిఆర్ఎస్ తీవ్రమైన అసంతృప్తి ఉందని అందుకు నిదర్శనం చీప్ విప్ దాస్యం వినయ్భాస్కర్ చేసిన కామెంట్  అని అన్నారు.  తనకు కావాల్సింది చీప్ విప్ కాదంటూ మంత్రిగా చూడాలని వుంది. అసంతృప్తి పై  ఆయన బిజెపి ని  విమర్శించడం పై ఎం.ఎల్.ఎసమాధానం చెప్పాలన్నారు.


బిజెపి ఎలాంటి ఆకర్ష్ చేయడం లేదని  అవి టిఆర్ఎస్ కే  ఎక్కువ తెలుసునని  ఎంపీ బండి సంజయ్ ఆరోపిస్తూ నరేంద్ర మోడీ     పాలన పై నమ్మకం బిజెపి సిద్ధాంతాలకు  కట్టుబడి ఉన్న వారెవరైనా చివరకు టిఆర్ఎస్ అసం తృప్తి వాదులైన మా పార్టీలోకి స్వాగతిస్తామని సగర్వంగా తెలిపారు. నల్లమల లొ గురించి  విలేకరులు ప్రశ్నించగా యురేనియం పై  సర్వే మాత్రం  జరుగుతున్నదని. తవ్వకాలు  కాదని ఈ విషయంలో  సామాజిక మాధ్యమాల్లో   వస్తున్న దాంట్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన ఆరోపించారు.         రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకం లో   కేంద్ర ప్రభుత్వం వాటిపై ఒక శ్వేత పత్రం  విడుదల చేస్తే ప్రజలకు వాస్తవాలు  తెలుస్తుందని ఆయన అన్నారు.  దేశంలో సామాన్య  ప్రజల సంక్షేమం  లక్ష్యంగా సాగుతున్న    ప్రధాన మోడీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆస్పత్రి ఇన్చార్జి డ్యూటీ డాక్టర్ లక్ష్మి తొ   మాట్లాడీ ఆస్పటల్ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. వార్డులలో రోగుల వద్దకు  వెళ్లి పండ్ల పంపిణీ చేస్తూ  నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై రోగుల కూడా వివరించారు .  అనంతరం ఆయన ఆసుపత్రి డ్యూటీ లక్ష్మి రెడ్డి తో మాట్లాడుతూ ఏ సమస్య వచ్చినా నేను సరి చేస్తానని బిజెపి ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుందని ఇన్చార్జి డాక్టర్ లక్ష్మి రెడ్డి తో తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ బిజెపి నాయకులు సతీష్ రెడ్డి సునీల్ శంకర్ఎంపీకి డాక్టర్ లక్ష్మి రెడ్డి తో పాటు వైద్యులు సిబ్బంది పుష్పంతో ఎంపీ గారిని స్వాగతం పలికారు అనంతరం ఆస్పత్రి ఆవరణలో బిజెపి నాయకుడు కొండేటి శ్రీధర్ బాబ వరంగల్ తూర్పు ఇన్చార్జి కుసుమ సతీష్ గొడవపడ్డారు ఇరువర్గాలకు సమస్యను ఎంపీ గారు మందలించడంతో ఇరువురునీ శాంతింపజేశారు