స్కూళ్ల అభివృద్ధి పై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష

11–09–2019
అమరావతి


అమరావతి: స్కూళ్లను అభివృద్ధి చేయడంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
ప్రతి మండలానికీ జూనియర్‌ కాలేజీ ఉండాలి: సీఎం
ఆమేరకు భవిష్యత్‌ కార్యాచరణ సిద్ధంచేయండి: సీఎం
ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లను క్రమపద్ధతిలో ప్లస్‌ టూ వరకూ పెంచాలన్న సీఎం
జూనియర్‌ కాలేజీ స్థాయికి వీటిని తీసుకు వెళ్లాలన్న సీఎం
ఎక్కడెక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి, ఏ ప్రాంతాల్లో చేయాలన్నదానిపై ఒక ప్లాన్‌ సిద్ధం చేయాలన్న సీఎం
ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికి ఒక కాలేజీ చొప్పున బాగుచేయడంపై ప్రణాళిక వేయాలన్న సీఎం
స్కూళ్ల తరహాలోనే కార్యాచరణ ప్రణాళిక తీసుకోవాలన్న సీఎం


నాడు– నేడు కింద 44,512 పాఠశాలలను బాగుచేయనున్న ప్రభుత్వం
మొదటి విడతలో 15410 స్కూళ్లలో నాడు – నేడు కార్యక్రమం
9 రకాల కనీస వసతులను కల్పించనున్న ప్రభుత్వం 
పంచాయతీరాజ్, మున్సిపల్, ట్రైబల్, సోషల్, బీసీ వెల్ఫేర్‌ ఇలా అన్ని శాఖలకు చెందిన స్కూళ్లు కూడా ప్రతి దశలో ఉండేలా చూసుకోవాలన్న సీఎం
తొలిదశలో టార్గెట్‌ పెరిగినా పర్వాలేదన్న సీఎం
ఏ స్కూల్‌ తీసుకున్నా 9 రకాల పనులు తప్పనిసరిగా పూర్తికావాలన్న సీఎం
చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలని, దాంట్లో రాజీపడవద్దని స్పష్టంచేసిన సీఎం


మార్చి 14, 2020 నాటికి నాడు–నేడు కింద తొలిదశ స్కూళ్లలో చేపట్టిన పనులు పూర్తిచేస్తామన్న అధికారులు
స్కూళ్లలో చేపడుతున్న పనులకు విద్యా కమిటీల రాటిఫికేషన్‌ ఉండేలా చూడాలన్న సీఎం
విద్యా కమిటీలు సామాజిక తనిఖీ చేయాలన్న సీఎం


స్కూళ్ల బాగుకోసం ప్రభుత్వం తీసుకుంటున్న  చర్యలను తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారంటూ సీఎం దృష్టికి తీసుకు వచ్చిన అధికారులు
బడుల బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులదే అన్న భావన కలిగించాలన్న సీఎం
స్కూళ్లను అభివృద్ధిచేయడంలో పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలన్న సీఎం
స్కూళ్ల బాగుకోసం క్యాంపెయిన్‌ చేయనున్న ప్రభుత్వం
విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చూడనున్న ప్రభుత్వం


వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 8 వ తరగతి వరకూ ఇంగ్లిషు మాధ్యమంలో బోధన
దాని తర్వాత 9, 10 తరగతులకూ ఇంగ్లిషు మాధ్యమంలో బోధన
70వేలమంది టీచర్లకు ఇంగ్లిషు బోధనలో శిక్షణ
డైట్స్‌లో ఇంగ్లిషు బోధనపై శిక్షణ ఇచ్చేలా, డైట్స్‌ను బలోపేతం చేసేలా ఒక ఆలోచన చేయాలన్న సీఎం
టీచర్లకు ఇచ్చిన శిక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం


విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడానికి కసరత్తు చేస్తున్నామన్న అధికారులు
ఖాళీల భర్తీ పక్రియను ప్రతి ఏడాది జనవరిలో పూర్తిచేయాలన్న సీఎం
ఏ శాఖ ఏ పరీక్షలు పెట్టాలన్నా జనవరిలో పెట్టాలని సీఎం సూచన
పర్యావరణం, క్లైమేట్‌ ఛేంజ్, రహదారి భద్రతపై పాఠ్యాంశాలు ఉంచాలన్న సీఎం
పుస్తకాలు, యూనిఫారమ్స్, షూ, స్కూలు బ్యాగు ఇవన్నీకూడా వచ్చే ఏడాది స్కూల్లో చేరిన రోజే ఇవ్వాలన్న సీఎం
ఎక్కడా ఆలస్యం కాకుండా ప్రణాళిక ఉండాలన్న సీఎం


ప్రయివేటు కాలేజీలకు అనుమతి ఇవ్వడం లేదన్నది అవాస్తవం: సీఎం
కాకపోతే అక్కడ  సరైన మౌలిక సదుపాయాలు, ఉన్నాయా? లేదా? అన్నది చూస్తున్నాం
ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నప్పుడు ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లలో కూడా సరైన సదుపాయాలు ఉండాలి: సీఎం
అలా ఉన్నప్పుడు ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు: సీఎం
కనీస ప్రమాణాలు, వసతులు లేకుండా ఏ విద్యా  సంస్థ అయినా ఉండడం సరికాదు: సీఎం
ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది, ప్రయివేటు సంస్థలు చేయాల్సిన పనులు వాళ్లు చేయాలి: సీఎం


మధ్యాహ్న భోజనం కింద ఇస్తున్న కోడిగుడ్ల నుంచి గతంలో బాగా నెగెటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ వచ్చిందన్న అధికారులు
అందుకే ప్రభుత్వం వచ్చాక గుడ్ల పంపిణీని వికేంద్రీకరించామన్న సీఎం
నాణ్యమైన గుడ్లు విద్యార్థులకు అందేలా ఇంకా ఎలాంటి విధానాలు అనుసరించాలన్నదానిపై మరిన్ని ఆలోచనలు చేయాలన్న సీఎం
అన్‌ ఇన్‌కంబర్డ్‌ బ్యాంకు ఖాతాలను తెరిచే బాధ్యత గ్రామ వాలంటీర్లదే : సీఎం


Popular posts
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
బీజేపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం
విజయవాడకు పంజాబ్ నుంచి వ‌చ్చే విద్యార్థుల కోసం రైల్వేస్టేష‌న్‌లో ఏర్పాట్లు
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image