వైభవంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

వైభవంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు


అమరావతి అక్టోబర్ 31 (అంతిమతీర్పు)


పర్యటక, భాషా, సాంస్కృతిక, క్రీడా, యువజనాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్


స్వాతంత్ర్య సమర యోధులకు సత్కారం                                                                


మూడు రోజుల పాటు సాంస్కృతిక కదంబం


నోరూరించే తెలుగు రుచుల తియ్యదనం                                                               


గాంధీజి ఛాయా చిత్రాలు, స్టాంపుల ప్రదర్శన


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సర్వం సిద్దం అయ్యింది. మరి కొన్ని గంటల వ్యవధిలో నగరంలోని ఇందిరా గాంధీ నగర పాలక సంస్ధ క్రీడా ప్రాంగణం వేదికగా మూడు రోజుల కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర గవర్నర్ మాన్యశ్రీ బిశ్వ భూషన్ హరిచందన్, ముఖ్యమంత్రి మాననీయ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిధులుగా ఈ కార్యక్రమానికి హాజరు కానుండగా, పర్యాటక భాషా, సాంస్కృతిక, క్రీడా, యువజనాభ్యుదయ శాఖ  ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు విశేష ఏర్పాట్లు చేసింది. మరోవైపు జిల్లా యంత్రాంగం కార్యక్రమం విజయవంతానికి కృషి  చేస్తోంది. రాష్ట్ర అవతరణ వేడుకల నేపధ్యంలో భారతావనికి స్వేఛ్చా వాయివులు ప్రసాదించటంలో కీలక భూమికను పోషించిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోనున్నారు. వారికి నివాళి అర్పించటంతో పాటు, దివంగత సమర యోధుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా సత్కారం చేయనున్నారు. రాష్ట్ర పధమ పౌరుడు బిశ్వ భూషణ్ హరిచందన్, రాష్ట్రాధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల చేతుల మీదుగా వీరు గౌరవాన్ని అందుకోనున్నారు.


 పింగళి వెంకయ్య, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, భోగరాజు పట్టాభి శీతారామయ్య, వావిలాల గోపాల కృష్ణయ్య , కన్నెగంటి హనుమంతు, ఉయ్యాలవాడ నరశింహారెడ్డి, కడప కోటిరెడ్డి, అచార్య ఎన్ జి రంగా, పొట్టి శ్రీరాములు, దామోదరం సంజీవయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, దుర్గాభాయి దేశ్ ముఖ్, సురవరం ప్రతాప రెడ్డి, అల్లూరి సీతారామరాజు, తెన్నేటి విశ్వనాధం తదితరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది.  ఈ నేపధ్యంలో వేడుకల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న పర్యటక, భాషా, సాంస్కృతిక, క్రీడా, యువజనాభ్యుదయ శాఖ ముఖ్య కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందన్నారు. మూడు రోజుల పాటు కార్యక్రమాలు జరగనుండగా, సభాకార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం కానుందన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ చేనేత, హస్త కళల ప్రదర్శన నిర్వహిస్తున్నామని, రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభవేళ  నేత కళాకారులు రాయితీలకు కూడా అందించనున్నారని వివరించారు.


 అదరహో అనిపించేలా తెలుగు సాంప్రదాయక ఆహార ఉత్సత్తుల ప్రదర్శన సైతం నిర్వహిస్తున్నామని, డ్వాక్రా సంఘల మొదలు స్టార్ హోటళ్ల వరకు వివిధ స్ధాయిలలో తెలుగు రుచులు సిద్దం కానున్నాయని ప్రవీణ్ కుమార్ వివరించారు. గాంధీజీ 150 జయంతి వేడుకలను సైతం గుర్తు చేసుకుంటూ జాతిపిత మహాత్మా గాంధీ చిత్రాలు, ఛాయా చిత్రాలు, స్టాంపుల ప్రదర్శన ఏర్పాటు చేసామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు , ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారన్నారని మూడు రోజల పాటు ప్రాంగణంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకతను సంరించుకోనున్నాయని వివరించారు. నవంబరు మూడవ తేదీ వరకు ప్రతి సాయంత్రం కూచిపూడి నృత్యాలు, సురభి నాటకములు, లలిత సంగీతం, జానపద కళారూపాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదిక అలరించనుందని ముఖ్య కార్యదర్శి  ప్రవీణ్ కుమార్ వివరించారు.


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image