బీడువారిన నేలను మాగాణంలా మార్చేందుకు మంత్రి మేకపాటి మొక్కవోని దీక్ష

పత్రికా ప్రకటన


తేదీ : 30-10-2019,
అమరావతి.


బీడువారిన నేలను మాగాణంలా మార్చేందుకు మంత్రి మేకపాటి మొక్కవోని దీక్ష


• జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో మంత్రి మేకపాటి భేటీ
• సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-1 పనులు పూర్తికి సహకారం
• సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-2 టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి
• సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ -2 పూర్తికి ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి అనిల్ ను కోరిన మంత్రి మేకపాటి
• ప్రతి గ్రామంలోని ప్రతి ఎకరాకు నీరందించే విధంగా తీర్చిదిద్దిన డాక్యుమెంట్ ఫైల్ ను మంత్రి అనిల్ కు అందించిన గౌతమ్ రెడ్డి


అమరావతి, అక్టోబర్, 30; సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-2  ప్రారంభానికి పనుల కదలికలో పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ , జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలలో తీవ్ర వర్షాభావం ఉండే మెట్టప్రాంతానికి సాగు, తాగునీరు ఇచ్చి ఆ ప్రాంత ప్రజల కలను సాకారం చేసే ప్రక్రియలో మంత్రి మేకపాటి వేగం పెంచారు. బుధవారం ఉదయం సచివాలయంలోని తన కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ -2 పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చొరవచూపాలని మంత్రి మేకపాటి కోరారు. ప్రతి గ్రామంలోని ప్రతి ఎకరాకు నీరందేలా ఫేజ్-2 పనుల ప్రారంభానికి అవసరమైన టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడంపై సహకరించాలన్నారు. టెండర్లను పిలిచి పనులు పరుగులు పెట్టించి రాబోయే సాగు సమయానికి నీరందించేలా చేయాలని కోరారు. అందుకోసం రూపొందించిన  పూర్తి వివరాలను డాక్యుమెంట్ రూపంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మేకపాటి గౌతమ్ రెడ్డి అందించారు. 


 సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-2 పనులు పూర్తి చేసి నెల్లూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోని సుమారు 100 గ్రామాల రైతాంగానికి వేలాది ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగు నీరు అందించేందుకు చొరవచూపాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను మేకపాటి కోరారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ పనులను ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు మంత్రి మేకపాటి. సోమశిల రిజర్వాయర్  ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలకు సమీపంలోనే ఉన్నా కాలువలు లేక నీరు అందక అక్కడి రైతాంగం పడుతున్న ఇబ్బందులను మరోమూరు సంబంధిత శాఖ మంత్రి అనిల్ యాదవ్ కు వివరించారు. గత ఐదారేళ్లలో వర్షం లేక, కాలువల్లో నీరు కరవై పొట్టకూటి కోసం వలస వెళుతున్న పల్లె ప్రజల అవస్థలను తీర్చేందుకు సహకరించాలని కోరారు. తానూ నెల్లూరు జిల్లాకు చెందిన  మంత్రిగా సోమశిల ప్రాజెక్టు పనుల పూర్తిలో తన భాగస్వామ్యం, సహకారం సంపూర్ణంగా అందిస్తానని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు.


Popular posts
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
ప్రపంచం అంతా ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సం జరుపుకుంటోంది.: నారా లోకేష్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి*
Image
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పాఠశాలల ప్రారంభ నిర్ణయంపై పునరాలోచించాలి* ఏ.బి.వి.పి నేత చల్లా.కౌశిక్.... వింజమూరు, ఆగష్టు 26 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సెప్టెంబర్ 5 నుండి పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచించడం సబబు కాదని, వెంటనే ఈ అనాలోచిత నిర్ణయాన్ని ఉపసం హరించుకోవాలని అఖిల భారతీయ విధ్యార్ధి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి చల్లా.కౌశిక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కౌశిక్ బుధవారం నాడు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సాక్షాత్తూ విద్యాశాఖా మంత్రి కరోనా బారిన పడి బాధపడుతున్నా వారికి బోధపడక పోవడం ఆశ్చర్యకరమన్నారు. జగనన్న విద్యాదీవెన, నాడు-నేడు పధకాల ప్రారంభం, ప్రచార ఆర్భాటాల కోసం పిల్లల జీవితాలను పణంగా పెట్టాలని చూస్తే ఏ.బి.వి.పి చూస్తూ ఊరుకోదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విధ్యార్ధుల తల్లిదండ్రులతో గ్రామ, గ్రామీణ సర్వేను ఏ.బి.వి.పి నిర్వహించిందని కౌశిక్ పేర్కొన్నారు. 82 శాతం మంది తల్లిదండ్రులు పాఠశాలల ప్రారంభ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. ఉన్నత విద్య, డిగ్రీ, పి.జీ, విశ్వ విద్యాలయాలలో చదివే విధ్యార్ధులు రోగనిరోధక శక్తి కలవారన్నారు. వారిని కాకుండా కేవలం ముందుగా పాఠశాలల బడులను తెరవడంలో ఆంతర్యమేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచంలోని పలు దేశాలు ఇలాగే అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న పర్యవసానాలలో భాగంగా ప్రారంభించిన కొద్ది రోజులలోనే లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఆన్లైన్ ఫీజుల దందాను అరికట్టడంలో శ్రద్దాసక్తులు లేని రాష్ట్ర ప్రభుత్వానికి పాఠశాలల ప్రారంభానికి ఎందుకంత ఆరాటమన్నారు. కార్పోరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని ఇక ప్రత్యక్షంగా చేసుకోవడానికి ప్రభుత్వం మార్గాలు సుగమం చేయడమేనని కౌశిక్ దుయ్యబట్టారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దందా - ప్రభుత్వ పధకాల ప్రచార దందా రెండూ కలిసి వస్తాయా అని సూటిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. రోగ నిరోధక శక్తి తక్కువ కలిగి ప్రస్తుత కరోనా పరిస్థితులను ఎదుర్కోలేని పసిపిల్లలపై ప్రభుత్వ అసంబద్ధ ప్రయోగాలు విరమించుకోవాలని హితువు పలికారు. లేని పక్షంలో ఏ.బి.వి.పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందని కౌశిక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Image