8మంది టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు : ఎంపీ గల్లా

8మంది టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు : ఎంపీ గల్లా
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 800 మంది సానుభూతిపరులపై వైసీపీ శ్రేణులు దాడులు చేశాయని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారన్నారు. దీనిపై గత నెలలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు (ఎన్‌హెచ్‌ఆర్సీ) ఫిర్యాదు చేశామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు.