గతంలో టీడీపీ, ఇపుడు వైసీపీ కూడా కేంద్ర పధకాలను తమ పధకాలుగా చెబుతోంది

విజయవాడ


విజయవాడ సింగ్ నగర్ లో బీజేపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ 


*బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కామెంట్స్*


4 నెలల కాలంలో ప్రభుత్వ పథకాలు అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే అందుతున్నట్టు మా దృష్టికి వచ్చింది


గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే విధంగా చేసింది


గతంలో టీడీపీ, ఇపుడు వైసీపీ కూడా కేంద్ర పధకాలను తమ పధకాలుగా చెబుతోంది


లబ్ధిదారుల ఎంపిక వైసీపీ కార్యకర్తలకు కమిటీల ద్వారా చేయటం సరికాదు


టీడీపీ ని వదిలి చాలా మంది వదిలి వెళ్తున్న కారణంగానే చంద్రబాబు బీజేపీ.పొత్తు వదిలామని బాధ పడుతున్నారని భావిస్తున్నా


వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా ముందుకు వెళ్లాలని ఆ దిశగా పార్టీ ని అభివృద్ధి చేయాలని పని చేస్తున్నాం


ఏపీ లో నిర్ణయాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం


వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి బీజేపీ జూనియర్ పార్టీ గా వ్యవహరించదు